అన్నదాతలకు భరోసా ఇవ్వడానికే ప్రభుత్వం రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటు చేసిందని.. ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి అన్నారు. చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు మండలం వేల్కూరులో రైతు భరోసా కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ భరత్ గుప్తాతో కలసి మంత్రి ప్రారంభించారు.
'రైతులకు భరోసా ఇచ్చేందుకే కేంద్రాలు'
రైతులు పండించే పంటలను ప్రభుత్వం కొనుగోలు చేసి.. వారికి న్యాయం చేసే ప్రక్రియలో భరోసా కేంద్రాలు కీలక పాత్ర పోషిస్తాయని ఉపముఖ్యమంత్రి నారాయణస్వామి అన్నారు. చిత్తూరు జిల్లా వేల్కూరులో రైతు భరోసా కేంద్రాన్ని ప్రారంభించారు.
ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి
నారాయణస్వామి మాట్లాడుతూ.. రైతు పండించే పంటలను ప్రభుత్వం కొనుగోలు చేసి.. వారికి న్యాయం చేసే ప్రక్రియలో భరోసా కేంద్రాలు కీలక పాత్ర పోషిస్తాయని అన్నారు. దళారీ వ్యవస్థను నిర్మూలించి అన్నదాతలను ఆదుకోవడమే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతోందని వివరించారు.
ఇవీ చదవండి... తొట్టంబేడులో ఇరు వర్గాల ఘర్షణ... ఒకరు మృతి