ఇళ్ల పట్టాల పంపిణీపై కోర్టులు స్టే ఇవ్వటంపై ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామి చిత్తూరులో వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. రాజకీయ పార్టీలు హైకోర్టు, సుప్రీం కోర్టులకు చెప్పి మేనిఫెస్టోలు తయారు చేయవని అన్నారు. పేదలకు ఇళ్ల స్థలాలు ఇస్తామన్న ఎన్నికల హామీ మేరకు.. అమలు చేయాల్సిన బాధ్యత తమపై ఉందని ఉప ముఖ్యమంత్రి అన్నారు. పేదవాళ్లకు ఇళ్ల పట్టాలు ఇవ్వకుండా కోర్టులు స్టే ఇవ్వడం సరికాదని నారాయణ స్వామి అన్నారు. ఇళ్ల స్థలాల విషయంలో కోర్టులు త్వరితగతిన ఓ నిర్ణయం తీసుకోవాలని కోరారు.
'హైకోర్టు, సుప్రీంకోర్టులకు చెప్పి మేనిఫెస్టోలు తయారు చేయలేదు'
రాజకీయ పార్టీలు హైకోర్టు, సుప్రీం కోర్టులకు చెప్పి మేనిఫెస్టోలు తయారు చేయవని ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామి అన్నారు. పేద వాళ్లకు ఇళ్ల పట్టాలు ఇవ్వకుండా కోర్టులు స్టే ఇవ్వడం సరికాదని... ఈ అంశంపై కోర్టులు త్వరితగతిన నిర్ణయం తీసుకోవాలని కోరారు.
అమరావతిలో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకునేందుకే... చంద్రబాబు తపన పడుతున్నారని ఆరోపించారు. భూస్వాములు కబ్జా చేసిన భూములకు సంబంధించి న్యాయస్థానం స్టే విధించిందని.. అంతేకానీ పేదల ఇళ్ల పట్టాలకు సంబంధించి కాదని ఉప ముఖ్యమంత్రి అన్నారు. ఇళ్ల స్థలాల పంపిణీపై విధించిన స్టేపై న్యాయస్థానం క్లియరెన్స్ ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో 30 లక్షల మందికి ఇళ్ళ స్థలాలు పంపిణీ చేయడానికి ప్రభుత్వం ఏర్పాట్లు చేసినట్లు వెల్లడించారు. కోర్టులపై తాను చేస్తున్న వ్యాఖ్యలను వక్రీకరించవద్దంటూ ప్రకటించడం కొసమెరుపు.
ఇదీ చదవండి: 'అమరావతిలో ఇళ్ల స్థలాల పంపిణీపై హైకోర్టు తీర్పును సమర్ధించిన సుప్రీం'