రాష్ట్ర వ్యాప్తంగా 15 డిఅడిక్షన్ సెంటర్లను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ముఖ్యమంత్రి ప్రారంభించారు. తిరుపతి రుయా ప్రాంగణంలో కొత్తగా డిఅడిక్షన్ సెంటర్ ఏర్పాటు చేశారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పేదల సంక్షేమమే ధ్యేయంగా దశలవారీగా మద్యపాన నిషేధాన్ని అమలు చేస్తున్నారని ఉపముఖ్యమంత్రి నారాయణ స్వామి వివరించారు. వైద్యులు, నర్సులు అంటే ముఖ్యమంత్రికి అభిమానమని, ప్రజలకు మీరే దేవుళ్లని కొనియాడారు. డిఅడిక్షన్ సెంటర్ రుయాలో అందుబాటులోకి రావడం అదృష్టమని పేర్కొన్నారు.
తిరుపతిలో డిఅడిక్షన్ సెంటర్ ప్రారంభం - deputy minister narayana swamy
తిరుపతి రుయా ప్రాంగణంలో కొత్తగా ఏర్పాటు చేసిన డిఅడిక్షన్ సెంటర్ను ముఖ్యమంత్రి ప్రారంభించారు. వ్యసనానికి బానిసలుగా మారిన పేదవారికి కొత్త జీవితం ఇవ్వడానికి రాష్ట్రవ్యాప్తంగా 15 సెంటర్లు సీఎం ప్రారంభించారని ఉపముఖ్యమంత్రి వివరించారు.
డి. ఆడిక్షన్ సెంటర్ ను ప్రారంభించిన మంత్రి నారాయణ స్వామి