నేటి రోజుల్లో సైబర్ నేరాలు ఎక్కువయ్యాయని చిత్తూరు జిల్లా ఎస్పీ వెంకట అప్పలనాయుడు అన్నారు. చిత్తూరులో సైబర్ నేరాల నియంత్రణ ప్రత్యేక విభాగాన్ని ఆయన ప్రారంభించారు. ఆన్లైన్ షాపింగ్, ఫేస్బుక్, ఓటీపీ, ఈ-మెయిల్ లాంటి పేర్లతో సైబర్ మోసాలు ఎక్కువయ్యాయని.. ఈ తరహా నేరాలను అరికట్టడానికి ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. సైబర్ నేరాల దర్యాప్తు వేగవంతం చేయడానికి ఈ ప్రత్యేక విభాగం ఎంతో ఉపయోగపడుతుందన్నారు. సుశిక్షితులైన సిబ్బందిని నియమించినట్లు చెప్పారు.
సైబర్ నేరాల ప్రత్యేక విభాగం ప్రారంభం
చిత్తూరులో సైబర్ నేరాల ప్రత్యేక విభాగాన్ని ఎస్పీ వెంకట అప్పలనాయుడు ప్రారంభించారు. ప్రస్తుతం సైబర్ నేరాలు ఎక్కువయ్యాయని... వాటిని అరికట్టేందుకు ఈ విభాగం ఉపయోగపడుతుందని ఎస్పీ అన్నారు.
జిల్లాలో సైబర్ నేరాల ప్రత్యేక విభాగం ప్రారంభం