ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

సుప్రీం తీర్పుని స్వాగతిస్తున్నాం: సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ - cpi leader narayana news

ప్రధాన కేసుల్లో జరిగే వాదనలు, తీర్పులను ప్రత్యక్ష ప్రసారం చేయటం ద్వారా న్యాయవ్యవస్థ పారదర్శకత ప్రజలకు తెలుస్తుందని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ అన్నారు. చిత్తూరు జిల్లా నగరి మండలం ఐనంబాకంలో మాట్లాడిన ఆయన... జస్టిస్ ఎన్వీ రమణ తీర్పుని స్వాగతిస్తున్నట్లు తెలిపారు.

cpi leader narayana
సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ

By

Published : May 14, 2021, 6:48 PM IST

సుప్రీంకోర్టులో జరిగే ప్రధాన కేసుల్లో వాదోపవాదాలను, తీర్పులను ప్రత్యక్ష ప్రసారం చేయాలని జస్టిస్ ఎన్వీ రమణ తీర్పునిచ్చారు. చిత్తూరు జిల్లా నగరి మండలం ఐనంబాకంలో మాట్లాడిన సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ.. సర్వోన్నత న్యాయస్థాన ప్రధాన న్యాయమూర్తి ఇచ్చిన తీర్పుని స్వాగతిస్తున్నట్లు తెలిపారు. దీనివల్ల న్యాయవ్యవస్థ పారదర్శకతను ప్రజల్లోకి తీసుకువెళ్లగలమని అన్నారు. దీంతో న్యాయవ్యవస్థపై ప్రజలకు మరింత నమ్మకం కలుగుతుందని పేర్కొన్నారు. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ… గొప్ప తీర్పునిచ్చారని కొనియాడారు.

ABOUT THE AUTHOR

...view details