చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిలో కరోనా విజృంభిస్తుంది. కనీసం లక్ష జనాభా కూడా లేని పట్టణంలో కరోనా పాజిటివ్ కేసులు బుధవారానికి 47కుచేరాయి. వారం రోజుల వ్యవధిలోనే పదుల సంఖ్యలో కేసులు నమోదు అవుతుండటంతో స్థానికుల్లో కలకలం రేపుతోంది. ఇప్పటికే జిల్లా యంత్రాంగం శ్రీకాళహస్తి పై దృష్టి సారించారు. కరోనా వైరస్ వ్యాప్తి నివారణకు రెడ్ జోన్లను ఏర్పాటు చేసి.. నిబంధనలు కఠినంగా అమలు చేస్తున్నారు. అయినప్పటికీ కరోనా కేసులు సంఖ్య పెరుగుతుండటంతో ఎలాంటి పరిణామాలకు దారి తీస్తుందని స్థానికులు ఆందోళనలో ఉన్నారు.
శ్రీకాళహస్తిలో విజృంభిస్తోన్న కరోనా కేసులు - Coronal cases are increasing in Srikalahasti
శ్రీకాళహస్తిలో రోజురోజుకి కరోనా పాజిటివ్ కేసులు పెరిగిపోతున్నాయి. కనీసం లక్ష జనాభా కూడా లేని పట్టణంలో 47మందికి కరోనా సోకటంతో స్థానికులు ఆందోళనకు గురవుతున్నారు. జిల్లా యంత్రాంగం శ్రీకాళహస్తి పై ప్రత్యేక దృష్టి సారించారు.
శ్రీకాళహస్తిలో విజృంభిస్తోన్న కరోనా కేసులు