ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

అలిపిరిలో తితిదే పొరుగు సేవల ఉద్యోగుల ఆందోళన

తిరుపతిలో తితిదే పొరుగు సేవల ఉద్యోగులు ఆందోళన చేశారు. తమను తితిదే ఉద్యోగులుగా పరిగణించాలని డిమాండ్ చేశారు. పాలకమండలి ఛైర్మన్ సానుకూలంగా స్పందించిన మేరకు నిరసన విరమించారు.

Concerns of neighboring services employees in Alipiri Thirupathi
అలిపిరిలో తితిదే పొరుగు సేవల ఉద్యోగుల ఆందోళన

By

Published : May 28, 2020, 12:22 PM IST

తిరుపతి అలిపిరిలో తితిదే ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు ఆందోళన చేశారు. తమను రాష్ట్ర ఔట్ సోర్సింగ్ కార్పోరేషన్​లో కలపాలన్న తితిదే పాలకమండలి నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ నిరసన వ్యక్తం చేశారు. భౌతికదూరం పాటిస్తూ రోడ్డుపై బైఠాయించారు.

పాలకమండలి సమావేశంలో తమను తితిదే ఉద్యోగులుగానే పరిగణిస్తూ టైం స్కేల్ ఇచ్చేలా నిర్ణయం తీసుకోవాలంటూ తితిదే ఛైర్మన్ వై.వి సుబ్బారెడ్డికి వినతిపత్రం అందజేశారు. ఛైర్మన్ సానుకూలంగా స్పందించిన కారణంగా నిరసన విరమించారు.

ABOUT THE AUTHOR

...view details