ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'అంతర్రాష్ట్ర చెక్​పోస్ట్​ల వద్ద నిఘాను కట్టుదిట్టం చేయండి' - కలెక్టర్ హరినారయణ్ తాజా సమాచారం

అంతర్రాష్ట్ర చెక్​పోస్ట్​ల వద్ద నిఘాను మరింత కట్టుదిట్టం చేయాలని కలెక్టర్ హరినారాయణ్ ఆదేశించారు. ఆ మేరకు సరిహద్దు మండలాల తహసీల్దార్లు, అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. గ్రామీణ ప్రాంతాల్లో కేసులు పెరుగుతున్నందున గ్రామ స్థాయి కమిటీలు మరింత సమర్థ వంతంగా పని చేయాలన్నారు.

collector harinarayan
కలెక్టర్ హరినారాయణ్

By

Published : Jun 1, 2021, 7:31 PM IST

చిత్తూరు జిల్లాలో కొవిడ్ నియంత్రణ కోసం అంతర్రాష్ట్ర చెక్ పోస్టుల వద్ద నిఘాను మరింత కట్టుదిట్టం చేయాలని జిల్లా కలెక్టర్ హరినారాయణన్ ఆదేశించారు. జిల్లా సచివాలయం నుంచి తమిళనాడు- కర్ణాటక రాష్ట్రాల సరిహద్దు మండలాలైన నాగలాపురం, శాంతిపురం, చౌడెపల్లి, పుంగనూరు, వి.కోట మండలాల తహసీల్దారులు, అధికారులతో ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.

గ్రామీణ ప్రాంతాల్లో కేసులు పెరుగుతున్నందున గ్రామ స్థాయి కమిటీలు మరింత సమర్థ వంతంగా పని చేయాలని కలెక్టర్ ఆదేశించారు. హోం ఐసోలేషన్​లో ఉన్న వారి ఆరోగ్య స్థితి గతులను ఎప్పటికప్పుడు మెడికల్ ఆఫీసర్లు ద్వారా తెలుసుకొని అవసరమైన సలహాలు సూచనలు అందించాలన్నారు

ఇదీ చదవండి

YV subbareddy: 'ఆనందయ్య ఔషధానికి ఆయుర్వేద గుర్తింపు వస్తేనే తితిదే ద్వారా పంపిణీ'

ABOUT THE AUTHOR

...view details