ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

తితిదే ఆదాయ వ్యయాలపై కాగ్‌ ఆడిటింగ్ సాధ్యమయ్యేనా..? - thirumala temple news updates

తితిదే ఆదాయ, వ్యయాలపై కాగ్‌ ద్వారా ఆడిట్‌ చేయించాలన్న ధర్మకర్తల మండలి నిర్ణయం అమలుపై ఆడిటింగ్‌ నిపుణులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. 12ఏళ్ల క్రితం ఇలానే తీర్మానం చేసినా.... అమలుకు నోచుకోని విషయాన్ని గుర్తు చేస్తున్నారు. ప్రభుత్వ నిధుల ప్రమేయం లేని తితిదే ఆదాయ, వ్యయాలను కాగ్‌ ఆడిట్‌ చేయాలంటే ప్రత్యేక పరిస్థితుల్లో మాత్రమే సాధ్యమని ఇందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడితేవాల్సిన అవసరముందని అభిప్రాయపడుతున్నారు.

cog auditing on ttd financial matters
తితిదే ఆదాయ వ్యయాలపై కాగ్‌ ఆడిటింగ్

By

Published : Sep 10, 2020, 5:17 PM IST

తితిదే నిధులు హిందూ ధార్మికేతర కార్యకలాపాలకు వినియోగిస్తున్నారన్న ఆరోపణలతో తితిదే ఆదాయ, వ్యయాలపై కేంద్ర ప్రభుత్వసంస్థ కంప్ట్రోలర్‌ ఆండ్‌ ఆడిటర్ జనరల్‌-కాగ్‌ ద్వారా ఆడిట్‌ చేయించాలని ధర్మకర్తల మండలి తీర్మానం చేసింది. ఐతే ధర్మకర్తల మండలి నిర్ణయం అమలు సాధ్యా సాధ్యాలపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. నిబంధనల మేరకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిధులు ప్రమేయం ఉన్నవాటిపై మాత్రమే కాగ్‌ ఆడిటింగ్‌ చేస్తుంది. ప్రభుత్వ నిధులు లేని తితిదే ఆదాయ, వ్యయాలపై కాగ్‌ ఆడిటింగ్‌ చేయడానికి ఆమోదం లభిస్తుందా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

ప్రపంచ ప్రఖ్యాత పుణ్యక్షేత్రమైన తిరుమల శ్రీవారికి భక్తులు సమర్పించే కానుకలు, విరాళాల ద్వారా ఏటా 3వేల కోట్ల రూపాయల మేర ఆదాయం సమకూరుతోంది. ఈ నిధులు ద్వారా శ్రీవారిని దర్శించుకొనేందుకు వచ్చే భక్తులకు వసతి సౌకర్యాలు కల్పించడంతో పాటు పలు సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేస్తోంది. తితిదే నిధుల ద్వారా నిరుపేదలకు ఉచిత విద్య, వైద్యం అందిస్తున్నారు. తిరుపతితో పాటు దేశరాజధాని దిల్లీలో సైతం తితిదే నిధులతో విద్యాసంస్థల నిర్వహణ సాగుతోంది.

తితిదే ఆదాయ వ్యయాలపై కాగ్‌ ఆడిటింగ్

తితిదే నిధుల వినియోగంపై ఇటీవల ఆరోపణలు వచ్చాయి. ఈ నిధులను హిందూ ధార్మికేతర కార్యక్రమాలకు వినియోగిస్తున్నారన్న విమర్శలతో తితిదే కీలక నిర్ణయం తీసుకొంది. నిధుల వినియోగంపై విమర్శలకు తావులేకుండా కాగ్‌ ద్వారా ఆడిటింగ్‌ చేయించాలని తీర్మానం చేశారు. తితిదే నిర్ణయాన్ని స్వాగతిస్తున్న ఆడిటింగ్‌ నిపుణులు అమలుపై సంశయం వ్యక్తం చేస్తున్నారు. 2008 సంవత్సరంలో ఇదే తరహాలో చేసిన తీర్మానం అమలు కాలేదని గుర్తుచేస్తున్నారు.

నిధులు వినియోగంపై అంతర్గతంగా తితిదే ఏటా ఆడిట్‌ నిర్వహిస్తుండగా....రాష్ట్ర ఆడిట్ శాఖ ఎక్స్‌టర్నల్‌ ఆడిటింగ్‌ చేస్తుంది. 1961 నుంచి రాష్ట్ర ఆడిట్‌ శాఖ ద్వారా ఎక్స్‌టర్నల్‌ ఆడిటింగ్‌ జరుగుతుండగా..2006లో శాసనసభ పబ్లిక్ అకౌంట్స్‌ కమిటీ... తితిదే నిధుల ఆడిటింగ్‌పై సందేహం వ్యక్తం చేసింది. కాగ్‌తో ఆడిటింగ్‌ చేయించాలని నివేదిక సమర్పించింది. ఈ మేరకు 2008లో తితిదే తీర్మానం చేసినా అమలుకు నోచుకోలేదు. తిరిగి 12ఏళ్ల తర్వాత కాగ్‌ ఆడిటింగ్‌ కోరుతూ తీర్మానం చేశారు. ఈసారైనా ఇది అమలయ్యేలా కృషి చేయాలని ఆడిటింగ్‌ నిపుణులు సూచిస్తున్నారు.

ఇదీచదవండి.

అది 29 గ్రామాల సమస్యే: మంత్రి కొడాలి నాని

ABOUT THE AUTHOR

...view details