ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

వైకాపా అభ్యర్థి గురుమూర్తిది ఏ మతమో చెప్పాలి?: సునీల్ దేవ్​ధర్ - sunil devdhar meeting in thirupathi

వైకాపా ప్రభుత్వ వైఖరిపై భాజపా రాష్ట్ర వ్యవహారాల సహ ఇన్​ఛార్జ్ సునీల్ దేవధర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నికలో పోటీ చేస్తున్న వైకాపా అభ్యర్థి గురుమూర్తిది ఏ మతమో చెప్పాలని డిమాండ్ చేశారు. రామతీర్థం, అంతర్వేది ఘటనల్లో బాధ్యులపై చర్యలు తీసుకోకుండా.. సీబీఐ పేరుతో వైకాపా నేతలు చేతులు దులుపుకున్నారని విమర్శించారు.

co-in-charge of BJP state affairs Sunil Deodhar
భాజపా రాష్ట్ర వ్యవహారాల సహ ఇన్​ఛార్జ్ సునీల్ దేవధర్

By

Published : Apr 10, 2021, 10:46 PM IST

తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నికలో పోటీ చేస్తున్న వైకాపా ఎంపీ అభ్యర్థి గురుమూర్తిది ఏ మతమో సీఎం జగన్ చెప్పాలని భాజపా రాష్ట్ర వ్యవహారాల సహ ఇన్​ఛార్జ్ సునీల్ దేవ్​ధర్ అన్నారు. తిరుపతిలో భాజపా-జనసేన ఆధ్వర్యంలో నిర్వహించిన "అణగారిన వర్గాలకు రాజ్యాధికారంలో సామాజిక న్యాయం" కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

హిందూత్వం పేరు చెప్పుకుని గెలిచిన వారందరూ అన్యమత ప్రార్థన మందిరాల్లో హిందూ దేవుళ్లను అవమానిస్తున్నారని సునీల్ దేవ్​ధర్ ఆరోపించారు. జీతాలు, పింఛన్లు సరిగ్గా ఇవ్వలేని సీఎం జగన్.. పాస్టర్లకు నిరాటంకంగా రూ.ఐదు వేలు ఎలా ఇస్తున్నారని ప్రశ్నించారు. రామతీర్థం, అంతర్వేది ఘటనల్లో నిందితులను పోలీసులు ఎందుకు పట్టుకోలేకపోతున్నారన్న దేవ్​ధర్... సీబీఐ పేరు చెప్పి చేతులు దులుపుకుంటున్నారని విమర్శించారు.

ఇవీచదవండి.

శ్రీశైలంలో వైభవంగా ప్రారంభమైన ఉగాది మహోత్సవాలు

ప్రముఖ ర్యాపర్​ మృతి.. బాలీవుడ్​ స్టార్స్​ సంతాపం

ABOUT THE AUTHOR

...view details