కుప్పంలో.. 'సీఎం చంద్రబాబు' నామినేషన్! - tdp leaders
చిత్తూరు జిల్లా కుప్పంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నామినేషన్ దాఖలైంది. ఎలాంటి హడావుడి లేకుండా, చాలా సాధారణంగా ఈ ప్రక్రియను పూర్తి చేశారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు తరఫున చిత్తూరు జిల్లా కుప్పంలో నామినేషన్ దాఖలైంది. స్థానికతెదేపా నేతలు నామినేషన్ ప్రక్రియ పూర్తి చేశారు. ఎలాంటి హంగు, ఆర్భాటాలు లేకుండాకుప్పం తహశీల్దార్ కార్యాలయంలో స్థానిక నేతలు నామపత్రాలను సమర్పించారు. రెస్కో ఛైర్మన్ పి.ఎస్.మునిరత్నం, ఉడా ఛైర్మన్ సుబ్రహ్మణ్యంరెడ్డి, బీసీ నాగరాజు, గుడిపల్లి మాజీ ఎంపీపీ భవానీ హాజరయ్యారు.ముఖ్యమంత్రితరఫున నారా భువనేశ్వరి ఈ పత్రాలను దాఖలు చేస్తారని ప్రచారం జరిగినా.. చివరికి స్థానిక నేతలే నామపత్రాలు దాఖలు చేశారు.