ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

తంబళ్లపల్లిలో మహిళలకు న్యాయవిజ్ఞానంపై అవగాహన - nyaya sameeska

చిత్తూరు జిల్లా తంబళ్లపల్లి జూనియర్ సివిల్ జడ్జి కోర్టు న్యాయమూర్తి అంజయ్య ఆధ్వర్యంలో... మహిళలకు ప్రత్యేకంగా న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు.

తంబళ్లపల్లిలో న్యాయ విజ్ఞాన సదస్సు

By

Published : May 4, 2019, 6:04 PM IST

తంబళ్లపల్లిలో న్యాయ విజ్ఞాన సదస్సు

చిత్తూరు జిల్లా తంబళ్లపల్లి జూనియర్ సివిల్ జడ్జి కోర్టు న్యాయమూర్తి అంజయ్య ఆధ్వర్యంలో... వెలుగు మండల సమాఖ్య కార్యాలయంలో న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. మండల న్యాయ సేవాసంఘం ఏర్పాటుచేసిన ఈ సదస్సులో మహిళల హక్కులు, చట్టాలు తదితర అంశాలపై చర్చ జరిగింది. జాతీయ లోక్ అదాలత్​ల ద్వారా కక్షిదారులు రాజీమార్గంలో కేసులు పరిష్కరించుకోవాలని న్యాయమూర్తి సూచించారు. కాలం వృథా, ధనవ్యయాన్ని అరికట్టడానికి లోక్ అదాలత్ వినియోగించుకోవాలన్నారు. భార్యాభర్తల తగాదాలు, విడాకులు, భూ సమస్యలు, మహిళా వేధింపులు, ర్యాగింగ్, వేధింపులు కేసులు పరిష్కార విధానాలపై ఈ సదస్సులో అవగాహన కల్పించారు. వెలుగు నిర్వాహకులు, మండల న్యాయ సేవాసంఘం సభ్యులు, స్వయం సహాయక సంఘాల మహిళలు పాల్గొన్నారు.

ABOUT THE AUTHOR

...view details