ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

సౌదీలో భర్త మరణం.. మృతదేహం కోసం భార్య పడిగాపులు - సౌదీలో చిత్తూరు వాసి మృతి

పొట్టకూటి కోసం పరాయిదేశం వెళ్లిన చిత్తూరు వాసి గుండెపోటుతో గత నెలలో మరణించాడు. కుటుంబ పెద్దను పోగొట్టుకున్న విషాదంలో ఉన్న ఆ కుటుంబానికి కనీసం కడసారి చూపు దక్కకుండా పోతోంది. నెలలు గడుస్తున్నా సౌదీలో మృతి చెందిన అమీన్ పీర్ మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అధికారులు అప్పగించలేదు.

సౌదీలో మృతి చెందిన భర్త మృతదేహం కోసం పడిగాపులు...!

By

Published : Sep 24, 2019, 10:51 PM IST

సౌదీలో మృతి చెందిన భర్త మృతదేహం కోసం పడిగాపులు...!

పొట్టకూటి కోసం సౌదీ అరేబియా వెళ్లిన చిత్తూరు జిల్లా కొటాల గ్రామానికి చెందిన బోడిబుట్ట అమీన్ పీర్.. గత నెలలో గుండెపోటుతో మృతి చెందాడు. నెలలు గడుస్తున్నా... తన భర్త మృతదేహాన్ని తమకు అప్పగించలేదని అతని భార్య హాతీమా ఆవేదన చెందుతుంది. అమీన్​ పీర్​కు రావాల్సిన ఆరు నెలల జీతం వచ్చేలా చూడాలని కోరింది. తమ కుటుంబానికి ఏ ఆధారం లేదని ఆవేదన చెందింది. తన భర్తను సౌదీకి పంపిన ఏజెంట్... ఇప్పుడు మృతదేహాన్ని అప్పగించకుండా, తాము రూ.15 లక్షలు డిమాండ్​ చేశామనే దుష్ప్రచారం చేస్తున్నాడని బాధితురాలు ఆరోపించింది. చిత్తూరు జిల్లా అధికారులు, విదేశాంగ అధికారులు స్పందించి తన భర్త మృతదేహాన్ని తమకు అప్పగించాలని వేడుకుంది.

ABOUT THE AUTHOR

...view details