ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

చివరిరోజు హోరెత్తిన నామినేషన్లు

చిత్తూరు జిల్లాలో పరిషత్‌ ప్రాదేశిక నియోజకవర్గానికి చివరిరోజు నామినేషన్లు హోరెత్తాయి. స్థానిక జెడ్పీ సమావేశ మందిరంలో బుధవారం జెడ్పీటీసీ అభ్యర్థుల నామినేషన్ల స్వీకరణ ముగిసింది. పలు రాజకీయ పార్టీలకు చెందిన ప్రముఖులు నామినేషన్లు వేశారు. అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేసేందుకు భారీ సంఖ్యలో అనుచరగణంతో రావడంతో చిత్తూరులో రహదారులు వాహనాలతో సందడిగా మారింది.

chittor  mptc nominations
చివరిరోజు హోరెత్తిన నామినేషన్లు

By

Published : Mar 12, 2020, 8:27 AM IST

చిత్తూరు జిల్లాలో చివరిరోజున 421 నామినేషన్లు దాఖలయ్యాయి. గత మూడ్రోజులుగా జిల్లాలోని 65 జెడ్పీటీసీ స్థానాలకు మొత్తం 480 నామినేషన్లు దాఖలు కాగా.. గత ఎన్నికల్లో 692 నామినేషన్లు దాఖలయ్యాయి. జిల్లాలో 886 ఎంపీటీసీ స్థానాలు ఉండగా 28 స్థానాల్లో ఎన్నికలు నిలిచిపోయాయి. మిగతా స్థానాలకు నామినేషన్లను అభ్యర్థులు దాఖలు చేశారు. నామినేషన్ల స్వీకరణ గడువు సాయంత్రం ఐదు గంటలకు పూర్తికావడంతో ఆర్వో కోదండరామిరెడ్డి ఆధ్వర్యంలో పోలీసులు నామినేషన్‌ కేంద్రం గేటుకు తాళాలు వేశారు. అభ్యర్థులు సాయంత్రం 4.45గంటలకెల్లా నామినేషన్‌ కేంద్రం లోపలకు వెళ్లారు. ఆలస్యంగా అభ్యర్థులు నామినేషన్‌ కేంద్రానికి రాకపోవడం గమనార్హం.

చివరిరోజు హోరెత్తిన నామినేషన్లు

జెడ్పీటీసీ స్థానాలకు నామినేషన్లు దాఖలు చేసిన వారిలో సదుం నుంచి రాష్ట్ర పంచాయతీరాజ్‌ మంత్రి రామచంద్రారెడ్డి సమీప బంధువు వైకాపా అభ్యర్థి సోమశేఖరరెడ్డి, యాదమరి స్థానానికి వైకాపా అభ్యర్థిగా ధనంజయరెడ్డి, డమ్మీ అభ్యర్థిగా ఉష నామినేషన్‌ వేశారు. కార్వేటినగరం స్థానానికి ఉప ముఖమంత్రి నారాయణస్వామి సతీమణి, కుమార్తె కృపాలక్ష్మి, సత్యవేడు ఎమ్మెల్యే ఆదిమూలం కుమారుడు సుమన్‌ కుమార్‌ తదితరులు ఉన్నారు.

చివరిరోజు హోరెత్తిన నామినేషన్లు

ఇదీ చదవండి:పల్నాడులో కర్రలు, కత్తుల స్వైరవిహారం

ABOUT THE AUTHOR

...view details