చిత్తూరు జిల్లా రామచంద్రాపురం మండలం అనుపల్ల గ్రామంలో విషాదం జరిగింది. ఉపాధిహామీ పనులు చేస్తుండగా బండరాయి కిందపడి బొప్పరాజు పల్లి గ్రామానికి చెందిన సులోచనమ్మ అనే మహిళ మృతి చెందింది.
సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని స్థానికుల సహాయంతో బండరాయిని తొలగించారు. మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం ఎస్వీ మెడికల్ కాలేజ్‌కు తరలించారు. అప్పటి వరకు హుషారుగా పనిచేస్తున్న భార్య మృతిని భర్త అల్లయ్య జీర్ణించుకోలేక సృహ కోల్పోయాడు.