ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

రూ.2 కోట్ల విలువైన ఎర్రచందనం దుంగలు పట్టివేత - red sandal cached in chittor district news

కోట్ల రూపాయల విలువైన ఎర్రచందనం దుంగలను చిత్తూరు జిల్లా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఏకకాలంలో వివిధ ప్రాంతాల్లో దాడులు నిర్వహించి ఎర్రచందనం స్మగ్లర్లును అదుపులోకి తీసుకున్నారు. కొంతమంది పారిపోగా... వారి కోసం గాలిస్తున్నామని పోలీసులు వెల్లడించారు.

red sandal
red sandal

By

Published : Oct 22, 2020, 7:04 AM IST

Updated : Oct 22, 2020, 10:40 AM IST

చిత్తూరు జిల్లాలో 2 కోట్ల రూపాయల విలువైన ఎర్ర చందనం దుంగలను పోలీసులు బుధవారం స్వాధీనం చేసుకున్నారు. తిరుపతి శేషాచలం అడవిలో నరికిన ఎర్ర చందనం దుంగలను వాహనాల ద్వారా చిత్తూరు రూరల్, గుడిపాల, యాదమరి తదితర ప్రాంతాలకు తరలిస్తున్నట్లు సమాచారం అందుకున్న పోలీసులు... ఏకకాలంలో ఈ ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహించారు.

11 మంది ఎర్ర చందనం స్మగ్లర్లను అదుపులోకి తీసుకొన్నారు. కొందరు స్మగ్లర్లు పారిపోగా.. వారి కోసం పోలీసులు గాలిస్తున్నారు. 96 ఎర్ర చందనం దుంగలు, 10 గొడ్డళ్లు, రెండు కార్లు, రెండు ఆటోలు, ఒక పాల వ్యాను స్వాధీనం చేసుకున్నట్లు చిత్తూరు డీఎస్పీ ఈశ్వర్ రెడ్డి వెల్లడించారు.

Last Updated : Oct 22, 2020, 10:40 AM IST

ABOUT THE AUTHOR

...view details