ఇదీ చదవండి:
జిల్లాలో కొవిడ్ కేర్ సెంటర్లను పెంచుతాం: జిల్లా కలెక్టర్ - చిత్తూరు జిల్లా వార్తలు
చిత్తూరు జిల్లాలో కరోనా పాజిటివ్ కేసులు సంఖ్య పెరుగుతుండటంతో కొవిడ్ కేర్ సెంటర్ల సంఖ్యను పెంచేందుకు చర్యలు చేపట్టామని కలెక్టర్ నారాయణభరత్ గుప్తా తెలిపారు. తిరుపతి నగరంలో ఏర్పాటు చేసిన కొవిడ్ కేర్ సెంటర్లలో వసతి సౌకర్యాలను మెరుగుపరిచే దిశగా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. కొవిడ్ కేసుల్లో పరిస్థితి విషమించిన వారు మాత్రమే ప్రాణాలు కోల్పోతున్నారని... మరణాల సంఖ్య అదుపులోనే ఉందని వివరించారు. ప్రైవేటు హోటల్స్‌ను కోవిడ్ కేర్ సెంటర్లుగా మార్చడానికి హోటల్స్ యాజమాన్యాలతో చర్చిస్తున్నామన్నారు. కేసులు సంఖ్య పెరుగుతుండటంతో తిరుపతి నగరంతో పాటు పుత్తూరు, నగరి, చిత్తూరులో అనధికారిక లాక్ డౌన్ కొనసాగిస్తామని వివరించారు.
chittoor district collector