ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

చిత్తూరు చిన్నారి హత్యకేసు : చాక్లెట్ ఆశ చూపి చంపేశాడు..! - varshita rape vartalu

చిత్తూరు జిల్లాలో చిన్నారి అత్యాచారం, హత్య కేసును పోలీసులు ఛేదించారు. చాక్లెట్ ఆశ చూపించి, ఫోటోలు తీస్తూ... చిన్నారిని ఏమార్చి అఘాయిత్యానికి పాల్పడినట్లు పోలీసులు వెల్లడించారు. ప్రత్యేక బృందాలుగా ఏర్పడి గాలించిన పోలీసులు... నిందితుడు రఫీని అదుపులోకి తీసుకొని రిమాండ్​కు తరలించారు.

చిత్తూరు చిన్నారి

By

Published : Nov 16, 2019, 6:06 PM IST

Updated : Nov 16, 2019, 11:31 PM IST

రాష్ట్రంలో సంచలనం సృష్టించిన చిత్తూరు జిల్లా చిన్నారి అత్యాచారం, హత్య కేసును పోలీసులు ఛేదించారు. నిందితుడు రఫీని ఛత్తీస్​గఢ్‌​లోని జగదల్​పూర్​లో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. చిన్నారికి చాక్లెట్ ఆశ చూపించి, ఫొటోలు తీస్తూ... తన వెంట నిర్జన ప్రాంతానికి తీసుకెళ్లి అఘాయిత్యానికి పాల్పడినట్లు వివరించారు. చిన్నారిపై అత్యాచారం చేసి... ఆపై హతమార్చి కల్యాణ మండపం వెనుక వదిలి వెళ్లినట్లు తేలింది. సీసీ ఫుటేజీ సహా... ఊహా చిత్రాల ఆధారంగా నిందితుడిని అదుపులోకి తీసుకున్నామని పోలీసులు తెలిపారు.

అసలేం జరిగింది..?
చిత్తూరు జిల్లా బి.కొత్తకోట మండలం గుట్టపాళ్యానికి చెందిన చిన్నారి... తల్లిదండ్రులతో కలిసి ఈనెల 7న చేనేతనగర్‌లోని కల్యాణ మండపంలో జరిగిన పెళ్లికి హాజరైంది. అప్పటి వరకు కల్యాణ మండపంలో సరదగా ఆడుకున్న చిన్నారి... ఉన్నట్లుండి కనిపించకుండా పోయింది. తల్లిదండ్రులు ఆందోళనకు గురై... చుట్టుపక్కల గాలించారు. మరుసటి రోజు మండపం వెనుక చిన్నారి విగతజీవిగా కనిపించింది. పోస్టుమార్టం నివేదికలో చిన్నారిపై అత్యాచారం చేసి చంపేసినట్లు తెలిసి... అంతా షాకయ్యారు.

నిందితుడి గతమంతా ఇంతే..!
నిందితుడు రఫీ వృత్తి రీత్యా లారీ క్లీనర్. చిన్నతనంలోనే ఓ అమ్మాయితో అసభ్యంగా ప్రవర్తించి... బాల నేరస్థుడిగా జైలు జీవితం గడిపినట్లు పోలీసులు వెల్లడించారు. రఫీ ప్రవర్తన సరిగా లేదని... భార్య అతడ్ని వదిలేసినట్లు జిల్లా ఎస్పీ తెలిపారు.

సీఎం సీరియస్...
చిన్నారి కేసుపై ముఖ్యమంత్రి జగన్ సీరియస్ అయ్యారు. ఈ ఘటన తీవ్రంగా కలిచివేసిందని వ్యాఖ్యనించారు. ఈ దారుణానికి ఒడిగట్టిన వారిని త్వరగా పట్టుకోవాలని... కఠినంగా శిక్షించాలని పోలీసులను ఆదేశించారు. రంగంలోకి దిగిన పోలీసులు... బృందాలుగా ఏర్పడి గాలించారు. చివరకు నిందితుడిని ఛత్తీస్​గఢ్‌​లో అదుపులోకి తీసుకున్నారు.

చాక్లెట్ ఆశ చూపి చంపేశాడు !

ఇదీచదవండి...

కొన్ని గంటల్లో శుభకార్యం... అంతలోనే విషాదం

Last Updated : Nov 16, 2019, 11:31 PM IST

ABOUT THE AUTHOR

...view details