చిత్తూరు జిల్లాలో.. ఆవుపై చిరుతపులి పంజా! - leopard Wandering
12:51 July 02
నాయకనేరిలో చిరుతపులి సంచారం
Leopard Wandering in Chittoor District: రాష్ట్రంలో నివాస ప్రాంతాల్లో పులుల సంచారం ప్రజలను ఆందోళనలకు గురిచేస్తోంది. గత కొద్ది రోజులుగా కాకినాడ, అనకాపల్లి జిల్లాల్లో స్థానికులు, అటవీశాఖ అధికారులను పెద్దపులి హడలెత్తిస్తోంది. తాజాగా.. చిత్తూరు జిల్లాలో చిరుతపులి సంచారం కలకలం రేపుతోంది. వి.కోట మండలంలో నాయకనేరిలో చిట్టిబాబు అనే రైతుకు చెందిన ఆవుపై చిరుత పంజా విసిరింది. ఈ దాడిలో ఆవు ప్రాణాలు కోల్పోయింది. ఆవును చిరుతే చంపిందని తెలిపిన అధికారులు.. అప్రమత్తంగా ఉండాలని స్థానికులకు సూచించారు. దీంతో స్థానికులు బయటకు వెళ్లాలంటేనే వణికిపోతున్నారు. ఈ సమాచారం అందుకున్న అటవీ సిబ్బంది.. ఘటనా స్థలానికి చేరుకుని. చిరుత సంచరించినట్లు ఆనవాళ్లు గుర్తించారు.
ఇదీ చదవండి: