మొదటి డోస్ వేసుకున్న తితిదే సిబ్బంది రెండో డోస్ కోసం వివరాలను అందించాలని చీఫ్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ మురళీధర్ కోరారు. ఉద్యోగులందరికీ సెంట్రల్ హాస్పిటల్లో కొవిడ్ వ్యాక్సిన్ వేయడానికి జిల్లా కలెక్టర్ ను కోరతామని తెలిపారు. ఉద్యోగులు వెంటనే వివరాలు అందించాలని ఆయన కోరారు.
తితిదే ఉద్యోగులకు రెండో డోస్ వ్యాక్సిన్‌కు చర్యలు - latest news in thirupathi
కొవాగ్జిన్ రెండవ డోస్ కోసం తితిదే ఉద్యోగుల వివరాలు ఇవ్వాలని ఆయా విభాగాధిపతులను వైద్యాధికారులు కోరారు. కరోనా లక్షణాలు కనిపించిన ఉద్యోగులు, పెన్షనర్లు వారి కుటుంబసభ్యుల సౌకర్యం కోసం బర్డ్ ఆసుపత్రిలో ట్రయాజ్ సెంటర్ ఏర్పాటు చేశామని తెలిపారు.
covid
కరోనా లక్షణాలు కనిపించిన ఉద్యోగులు, పెన్షనర్లు వారి కుటుంబసభ్యుల సౌకర్యం కోసం బర్డ్ ఆసుపత్రిలో ట్రయాజ్ సెంటర్ ఏర్పాటు చేశామని.. కరోనా పాజిటివ్ వచ్చిన వారికి ఇంట్లోనే చికిత్స తీసుకోవచ్చా, కొవిడ్ కేర్ సెంటర్ కు వెళ్లాలా.. అన్నది నిర్ణయిస్తామని తెలిపారు.
ఇదీ చదవండీ.. ప్రధాని మోదీకి అమరావతి రైతుల లేఖ