ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

చంద్రగిరి ఓటు గెలిచే రాజెవరు?

తృటిలో చేజార్చుకున్నాం... ఈసారీ మాత్రం పట్టుజారనీయొద్దని దూసుకెళ్తోంది పసుపుదళం. ఒక్కసారి పట్టు దొరికింది... ఇక వదిలేది లేదంటోంది యువజన శ్రామిక వర్గం. ఆరు నెలల ముందు నుంచే అస్త్రాన్ని సానపెట్టింది అధికార పార్టీ. ఎలాంటి వ్యూహాలు రచించినా గెలుపు ధీమా వ్యక్తం చేస్తోంది ప్రతిపక్షం. ఎన్నికలు కూత రాకముందే కాక రేపుతున్న చంద్రగిరిపై ఎవరి జెండా ఎగరనుంది?

చంద్రగిరి నీదా-నాదా?

By

Published : Mar 9, 2019, 8:03 AM IST

రాష్ట్ర రాజకీయాల్లోని అన్ని నియోజకవర్గాలు ఒక ఎత్తయితే... ఆ ఒక్క నియోజకవర్గం కాస్తా భిన్నం. అధికార, ప్రతిపక్షాలు సై అంటే సై అంటూ కయ్యానికి కాలుదువ్వుతాయి. అదే చిత్తూరు జిల్లాలోని చంద్రగిరి నియోజకవర్గం. ఇక్కడ కిందటిసారి ఫ్యాన్ గాలి వీయగా... ఎన్నికల పరుగులో సైకిల్ వెనుకబడింది. వచ్చే ఎన్నికల్లో మాత్రం పసుపు జెండా ఎగరేయటమే లక్ష్యంగా పావులు కదపుతోంది. తమ గెలుపు ఎవరూ ఆపలేరంటూ వైకాపా ప్రకటనతో చంద్రగిరి రాజకీయం రసవత్తరంలో పడింది.

చంద్రగిరి ఓటు గెలిచే రాజెవరు?

2014లో తెదేపా అభ్యర్థి గల్లా అరుణకుమారిపై 4500 ఓట్ల తేడాతో వైకాపా అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పైచేయి సాధించారు. ఈసారి మాత్రం చంద్ర'గురి' తప్పకూడదనే లక్ష్యంతో అధినేత చంద్రబాబు 6నెలల ముందే అభ్యర్థిగా పులివర్తి నాని నిర్ణయించారు. పోటీ నుంచి గల్లా అరుణకుమారి తప్పుకొని జిల్లా అధ్యక్షుడు నాని పోటీకి పచ్చజెండా ఊపారు. అధిష్ఠానం ఆలోచన తెలుసుకున్న పులివర్తి నాని నియోజకవర్గాన్ని చుట్టేస్తున్నారు. ప్రజలతో మమేకమై సమస్య పరిష్కారంపై దృష్టి పెట్టారు.
ప్రత్యర్థి వేగాన్ని అంచనా వేసిన సిట్టింగ్ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ప్రతివ్యూహాలు రచిస్తున్నారు. కుటుంబ సభ్యులందర్నీ ప్రచార బరిలోకి దించారు. ఎన్నికల పోల్ గంట మోగక ముందే తెలుగుదేశం, వైకాపా ఎత్తుకుపైఎత్తులతో చంద్రగిరి బరి సలసల మరుగుతోంది.
చంద్రగిరి నియోజకవర్గంలో ఓట్లు తొలగిస్తున్నారని ఇరు పార్టీల ఫిర్యాదులతో రాజకీయం మరో మలుపు తీసుకుంది. ఈ వివాదం ఏ దిశగా వెళ్తుందో... ఎక్కడ తీరం దాటుతుందో... గెలుపు గుర్రం ఎవరికి చిక్కుతుందోనన్న ఆసక్తి అందరిలోనూ నెలకొంది.

ABOUT THE AUTHOR

...view details