ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

అనగనగా ఓ గుట్ట.. ఆ గుట్ట గండెల్లో గుణపం

ఆ ఊరి పశుపోషణకు ఆ గుట్టే ఆధారం..! కొండంత అండగా ఉండే... ఆ గుట్ట గుండెల్లో గుణపం దిగింది. బుల్డోజర్లతో.. నామరూపాల్లేకుండా చేసే ప్రక్రియ మొదలైంది. ఊరంతా ఏకమై వద్దన్నా ప్రభుత్వం కనికరించడం లేదు. ఇంతకీ ఆ ఊరేంటి ? ఆగుట్ట గుట్టేంటి..?

chandragiri peoples
chandragiri peoples

By

Published : Jun 23, 2020, 3:58 PM IST

చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గంలోని పులవర్తివారి పల్లి వ్యవసాయాధారిత గ్రామం. పశుపోషణే ఎక్కువమంది జీవనాధారం. పశువులు, గొర్రెల్ని మేపుతూ.. బతుకు వెళ్లదీస్తున్నారు. ఆదోనిపల్లె సర్వే నెంబర్ 433లోని కొండ గుట్టే.. వారి పశుపోషణకు ఆదరువు. అందుకే ఆ గుట్టపేరు మేతబైలుగా మారిపోయింది. పేదలకు ఇళ్ల స్థలాల పథకంలో భాగంగా.. ఇప్పుడు ఆ గుట్టను చదను చేస్తుండడం గ్రామస్థులకు కంటిమీద కునుకులేకుండా చేస్తోంది.

పేరుకు పేదలకు ఇళ్ల స్థలాలైనా.. తమ గ్రామంలో కాకుండా 30 కిలోమీటర్ల దూరంలోని తిరుపతి రూరల్ ప్రజలకు ఇళ్లపట్టాలిచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయని.. స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పులివర్తివారి పల్లి, దాన్ని ఆనుకుని ఉన్న ఆదోనిపల్లెలో..ప్రభుత్వ భూములు, బీడు భూములు చాలా ఉన్నా.. వాటిని కాదని వ్యయప్రయాసలోకోర్చి ఈ గుట్టను చదును చేయాల్సి న అవసరమేంటే అర్థంకావట్లేదని గ్రామస్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

పశుపోషణకు జీవనాధారమైన మేతబైలును కోల్పోతే..తామంతా కుటుంబంతో సహా రోడ్డున పడాల్సిన పరిస్థితి వస్తుందని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఇదీ చదవండి:రాష్ట్రంలో పోలీసు రాజ్యం.. కేంద్ర మంత్రి చెప్పింది నిజం: సోమిరెడ్డి

ABOUT THE AUTHOR

...view details