సొంత నియోజకవర్గం కుప్పంలో పర్యటించనున్నారు.. ప్రతిపక్ష నేత చంద్రబాబు. రేపు, ఎల్లుండి (జులై 2, 3) నియోజకవర్గ వ్యాప్తంగా పలు ప్రాంతాలకు వెళ్లి.. అక్కడి స్థానిక కేడర్ తో సమావేశం కానున్నారు. రామకుప్పం, శాంతిపురం, గుడిపల్లె, కుప్పం మండలాల్లో కార్యకర్తలతో పాటు.. సీనియర్ నాయకులకు దిశా నిర్దేశం చేయనున్నారు. అధికారం కోల్పోయాక.. మొదటిసారి కుప్పంలో రెండు రోజుల పాటు చంద్రబాబు పర్యటించనుండడంపై.. కార్యకర్తలు ఆయన రాక కోసం ఎదురు చూస్తున్నారు.
రేపటి నుంచి కుప్పంలో చంద్రబాబు పర్యటన - చంద్రబాబు నాయుడు
ప్రతిపక్ష నాయకుడు, తెదేపా జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు.. తన సొంత నియోజకవర్గం కుప్పంపై దృష్టి పెట్టారు.
కుప్పంలో పర్యటించనున్న చంద్రబాబు