ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

నెల్లూరుకు చంద్రబాబు.. మార్గమధ్యంలో అభిమానుల ఘనస్వాగతం - నెల్లూరు వార్తలు

తెదేపా అధినేత చంద్రబాబు నెల్లూరులో రెండు రోజుల పర్యటన నిమిత్తం చిత్తూరు జిల్లా ఏర్పేడు చేరుకున్నారు. ఆయనకు వెంకటగిరి నేతలు ఘన స్వాగతం పలికారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో చంద్రబాబు నెల్లూరుకు వెళ్లారు.

chandrababu arrived to chittor district renigunta airport for two days of nellore tour

By

Published : Oct 14, 2019, 10:10 AM IST

Updated : Oct 14, 2019, 10:58 AM IST

ఏర్పేడులో చంద్రబాబుకు ఘనస్వాగతం

నెల్లూరు జిల్లాలో రెండు రోజుల పర్యటన నిమిత్తం తెదేపా అధినేత చంద్రబాబు చిత్తూరు జిల్లా రేణిగుంట విమానాశ్రయంలో దిగారు. ఏర్పేడు సమీపంలో ఆయనకు వెంకటగిరి నేతలు ఘనస్వాగతం పలికారు. మాజీ ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ నేతృత్వంలో పార్టీ కార్యకర్తలు చంద్రబాబును కలిశారు. శ్రీకాళహస్తి నియోజకవర్గం ప్రజలు ఏపీ సీడ్స్ కూడలిలో చంద్రబాబుకు స్వాగతం పలికారు . డప్పు వాయిద్యాల నడుమ కార్యకర్తలు చిందులు వేశారు. అనంతరం కార్యకర్తలకు అభివాదం చేస్తూ తెదేపా అధినేత నెల్లూరు కు వెళ్లారు.

నెల్లూరుకు చంద్రబాబు.. మార్గమధ్యంలో అభిమానుల ఘనస్వాగతం
Last Updated : Oct 14, 2019, 10:58 AM IST

ABOUT THE AUTHOR

...view details