చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలో తెలుగుదేశం అధినేత చంద్రబాబు పర్యటిస్తున్నారు. రాళ్లగంగమ్మ ఆలయం వద్ద గుడుపల్లె కార్యకర్తలతో చంద్రబాబు సమావేశమయ్యారు. పేదవాళ్లకు తెదేపా అండగా ఉంటుందని.. వారి తరఫున పోరాడుతుందని చంద్రబాబు అన్నారు. దోపిడీ రాజకీయాలు చేసి ప్రజలను బాధపెడితే ఊరుకునేది లేదని తేల్చిచెప్పారు. ఎవరెన్ని బెదిరింపులకు పాల్పడినా భయపడేది లేదని స్పష్టం చేశారు. రాజకీయాల్లో హుందాతనం చాలా అవసరమని హితవు పలికారు.
'పేదవాళ్లకు అండగా ఉంటా... వారి తరఫున పోరాడతా' - chandra babu fires on cm jagan
తెదేపా కార్యకర్తలను ఇబ్బందిపెడితే ఉపేక్షించబోనని ఆ పార్టీ అధినేత చంద్రబాబు స్పష్టం చేశారు. కుప్పం నియోజకవర్గంలో చంద్రబాబు పర్యటిస్తున్నారు. రాళ్లగంగమ్మ ఆలయం వద్ద గుడుపల్లె కార్యకర్తలతో చంద్రబాబు సమావేశమయ్యారు.
chandra babu tour at kuppam