ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఉద్రిక్తతల నడుమ 'చలో మదనపల్లె' కార్యక్రమం

ఉద్రిక్తతల నడుమ 'చలో మదనపల్లె' కార్యక్రమాన్ని ఎస్సీ ఎస్టీ సంఘాల నేతలు విరమించారు. అరెస్టైన నేతలను పోలీసులు విడుదల చేయగా.. వారు సబ్ కలెక్టర్​కు ఫిర్యాదు పత్రాన్ని అందజేశారు.

Chalo Madanapalle program has come to a halt in chittore district
సబ్ కలెక్టర్​కు వినతిపత్రం అందజేస్తున్న ఐకాస నేతలు

By

Published : Oct 2, 2020, 3:40 PM IST

ఉద్రిక్తతల నడుమ 'చలో మదనపల్లె' కార్యక్రమాన్ని ఎస్సీ ఎస్టీ సంఘాల నేతలు విరమించారు. ర్యాలీకి, బహిరంగ సభకు అనుమతి లేదంటూ సుమారు 30 మంది ఐకాస నేతలను అరెస్ట్ చేసిన పోలీసులు... తర్వాత వారిని విడుదల చేశారు.

విడుదలైన నేతలు మదనపల్లెలోని అంబేడ్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి... అక్కడి నుంచి శాంతియుత ర్యాలీగా సబ్ కలెక్టర్ కార్యాలయానికి చేరుకున్నారు. రాష్ట్రంలో జరుగుతున్న దళితులపై దాడులపై సబ్ కలెక్టర్ జాహ్నవికి ఫిర్యాదు చేశారు. సమస్యలను రాష్ట్ర ప్రభుత్వానికి తెలియచేయాలని కోరారు. అనంతరం చలో మదనపల్లె కార్యక్రమాన్ని విరమించారు.

ABOUT THE AUTHOR

...view details