తిరుమల శ్రీవారిని శాసన సభాపతి తమ్మినేని సీతారాం, రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి, తెలుగు అకాడమీ ఛైర్ పర్సన్ లక్ష్మీ పార్వతి దర్శించుకున్నారు. ఈ ఉదయం వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో స్వామివారి సేవలో పాల్గొన్నారు. శ్రీవారి దర్శనార్థం వచ్చే భక్తులకు తితిదే అద్భుతంగా ఏర్పాట్లు చేసిందని... కరోనా వైరస్‌కు త్వరలో వ్యాక్సిన్ రావాలని స్వామివారిని ప్రార్థించినట్లు విజయసాయిరెడ్డి తెలిపారు.
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ప్రముఖులు - తితిదే వార్తలు
తిరుమల శ్రీవారిని ప్రముఖులు దర్శించుకున్నారు. శాసన సభాపతి తమ్మినేని సీతారాం, రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి, తెలుగు అకాడమీ ఛైర్ పర్సన్ లక్ష్మీ పార్వతి స్వామివారి ఆశీస్సులు తీసుకున్నారు.
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ప్రముఖులు
తెలుగు అకాడమీ కేంద్ర కార్యాలయాన్ని తిరుపతిలో ఏర్పాటు చేస్తున్నామని లక్ష్మీ పార్వతి తెలిపారు. ఇందులో సంస్కృత భాషను కూడా కలపనున్నట్లు తెలిపారు. తిరుపతిలో శాశ్వత భవనాన్ని ఏర్పాటు చేస్తున్నామని పేర్కొన్నారు.
ఇదీ చూడండి.అమరావతి కోసం విదేశీ గడ్డపై గర్జించిన తెలుగు బిడ్డలు