చిత్తూరు జిల్లా శ్రీరంగరాజపురం మండలంలో పోలీసులు నిర్బంధ తనిఖీలు చేపట్టారు. తెల్లవారుజాము నుంచి పెద్ద తయ్యూరు, చిన్న తయ్యూరు కాలనీల్లో విస్తృతంగా సోదాలు చేశారు. 100 లీటర్ల నాటు సారాను గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. రెండు వేల లీటర్ల సారా ఊటను ధ్వంసం చేశారు. ఇంతే కాకుండా దస్త్రాలు లేని 9 ద్విచక్ర వాహనాలు, 70 కిలోల నల్లబెల్లం, సారా తయారీకి ఉపయోగించే పాత్రులను స్వాధీనం చేసుకున్నారు. తొమ్మిది మందిపై కేసు నమోదు చేశారు.
సారా తయారీ కేంద్రాలపై పోలీసుల దాడులు
గంగాధర నెల్లూరు నియోజకవర్గం శ్రీరంగరాజపురం మండలంలో పోలీసులు నిర్బంధ తనిఖీలు చేపట్టారు. రెండు రోజులుగా నాటు సారా దొరకడం వల్ల ఈ తనిఖీలు చేశారు. ఇందులో 100 లీటర్ల నాటుసారా పట్టుబడగా, 2 వేల లీటర్ల సారా ఊటను పోలీసులు ధ్వంసం చేశారు.
శ్రీరంగరాజపురం మండలంలో పోలీసులు కార్డెన్ సెర్చ్