చిత్తూరు జిల్లా రేణిగుంట సమీపంలో ప్రైవేటు ట్రావెల్స్ బస్సుకు త్రుటిలో ప్రమాదం తప్పింది. విశాఖ నుంచి బెంగళూరు వెళుతున్న ట్రావెల్స్ బస్సు బోల్తా పడింది. రోడ్డుపక్కనే నిలిపిఉన్న ఆటోపై పడడంతో భారీ ప్రమాదం జరిగిందని అందరూ ఆందోళన చెందారు. కానీ అదే అందరి ప్రాణాలు కాపాడింది. ఆటోపై ఒరిగి బస్సు ఆగిపోవడంతో పెను ప్రమాదం తప్పింది.ప్రయాణికులు స్వల్పగాయాలతో బయటపడ్డారు. అతివేగమే ప్రమాదానికి కారణమని పోలీసులు చెప్పారు.
ఆటోపై పడిన బస్సు .. తప్పిన పెను ప్రమాదం - on auto
పెను ప్రమాదం తప్పింది. బెంగుళూరు వెళుతున్న ప్రైవేటు ట్రావెల్స్ బస్సు బోల్తా పడింది. ప్రయాణికులు స్వల్ప గాయాలతో బయట పడడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
ఆటోపై పడిన బస్సు .. తప్పిన ప్రమాదం