'ఓటమి కారణాలు తెలుసుకుని.. తప్పులు సరిదిద్దుకుంటాం' - తెదేపా కార్యకర్తలు
కార్యకర్తలంతా కలిసి మెలిసి వైకాపా దాడులను ఎదుర్కోవాలని తెదేపా నేత బొజ్జల సుధీర్ రెడ్డి అన్నారు. సార్వత్రిక ఎన్నికల్లో ఎమ్మెల్యేగా ఓడిపోవడానికి గల కారణాలను తెలుసుకొని తప్పులు సరిదిద్దికుంటామని తెలిపారు.
తెదేపా కార్యకర్తలతో బొజ్జల సమావేశం
సార్వత్రిక ఎన్నికల్లో ఓడిపోవడం బాధగా ఉందన్నారు బొజ్జల సుధీర్‌రెడ్డి. అయినా ప్రజల తీర్పును గౌరవిస్తామన్నారు. శ్రీకాళహస్తిలో కార్యకర్తలతో సమావేశంలో ఆయన మాట్లాడారు. తెదేపా కార్యకర్తలపై వైకాపా దాడులు చేస్తే సహించబోమన్నారు. కార్యకర్తలంతా కలిసి దాడులను ఎదుర్కోవాలని సూచించారు. ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తామని తెలిపారు. ఓటమికి గల కారణాలను తెలుసుకొని తప్పులు సరిదిద్దికుంటామని అన్నారు.