ఎలాంటి అనుమతులు తీసుకోకుండా పేలుడు పదార్థాలను ఉపయోగించి బండలను పగలగొట్టిన కేసులో ఐదుగురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. చిత్తూరు జిల్లా మదనపల్లె పట్టణ పారిశ్రామిక వాడలోని వాణిజ్య దుకాణం నిర్మాణానికి కేటాయించిన స్థలంలో ఉన్న బండరాళ్లను తొలగించేందుకు ఆగస్టు 10వ తేదీన డిటోనేటర్లు, జిలెటిన్ స్టిక్స్ లను వినియోగించారు. ఈ ఘటనతో పరిసర ప్రాంతాల్లో ఉన్న నివాసాలు పాక్షికంగా దెబ్బతిన్నాయి. స్థానికుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన మదనపల్లె పోలీసులు వారిని రిమాండ్‌కు తరలించారు.
blasting case: అనుమతి లేకుండా బ్లాస్టింగ్.. ఐదుగురు అరెస్ట్ - chittoor news
చిత్తూరు జిల్లా మదలపల్లెలో అనుమతి లేకుండా బ్లాస్టింగ్‌కు పాల్పడిన ఐదుగురు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. స్థానికులు ఇచ్చిన ఫిర్యాదుతో వారు చర్యలు తీసుకున్నారు.
అనుమతి లేకుండా బ్లాస్టింగ్ పాల్పడిన ఐదుగురు అరెస్ట్