తితిదే ధర్మకర్తల మండలిలో సభ్యుల సంఖ్యను భారీగా పెంచడాన్ని నిరసిస్తూ భాజపా ఆందోళన చేపట్టింది.తిరుపతిలోని తితిదే పరిపాలనా భవనం ముందు ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి భానుప్రకాశ్‌రెడ్డి ఆధ్వర్యంలో నాయకులు,కార్యకర్తలు నిరసన తెలిపారు.సభ్యుల సంఖ్యను19నుంచి36కు పెంచుతూ సర్కారు జారీ చేసిన ఉత్తర్వులను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ,జీవో నకలు పత్రాలను దగ్ధం చేశారు.సీఎం జగన్ భక్తుల మనోభావాలను దెబ్బతీసేలా వ్యవహరిస్తున్నారని భాజపా నాయకులు మండిపడ్డారు.పరిస్థితి ఉద్రిక్తంగా మారడం వల్ల పోలీసులు రంగప్రవేశం చేసి ఆందోళనకారులను అరెస్టు చేశారు.
భారీ తితిదే పాలకమండలి పై భాజపా గరం గరం - bjp protest on govt gos on ttd baord members
తిరుమల తిరుపతి దేవస్థానం ధర్మకర్తల మండలిలో సభ్యుల సంఖ్యను 19 నుంచి 36 కు పెంచడంపై భాజపా మండిపడింది. భాజపా రాష్ట్ర కార్యదర్శి భానుప్రకాష్ రెడ్డి ఆధ్వర్యంలో కార్యకర్తలు జీవో నకలు పత్రాలను దగ్ధం చేశారు.
భాజపా నిరసన
TAGGED:
bjp protest at tirupaty