ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

వి.కోట వెళ్తున్న భాజపా నేతలు అరెస్ట్​, విడుదల

చిత్తూరు జిల్లా వి.కోట మండలంలో స్వాతంత్య్ర దినోత్సవం నాడు జరిగిన ఘటనపై భాజపా నాయకులు పరామర్శించేందుకు వెళ్తున్న పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి భాను ప్రకాష్​ రెడ్డితో పాటు ఇతర నేతలను పోలీసులు అరెస్టు చేశారు.

By

Published : Aug 16, 2019, 11:53 PM IST

భాజపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శిని అరెస్టు చేసిన పోలీసులు

భాజపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శిని అరెస్టు చేసిన పోలీసులు

చిత్తూరు జిల్లా వి.కోట మండలంలో ఆగస్టు 15న ఓ వ్యక్తి మాంసపు దుకాణం నిర్వహిస్తున్నాడని పలువురు భాజపా నాయకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ విషయంపై దుకాణ నిర్వాహకుడు పోలీస్​ స్టేషన్​ ఆవరణలో ఫిర్యాదుదారులపై చేయి చేసుకున్నందున గురువారం ఇరువర్గాల మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో గాయపడ్డ తమ కార్యకర్తలు, నాయకులను పరామర్శించేందుకు భాజపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి భాను ప్రకాష్​ రెడ్డి, పలువురు రాష్ట్ర స్థాయి భాజపా నాయకులు వెళ్లే క్రమంలో పలమనేరు వద్ద గంగవరం పోలీసులు అరెస్ట్​ చేసి స్టేషన్​కు తరలించారు.

తమ కార్యకర్తలు నాయకులపై దాడి జరిగి సుమారు 24 గంటలు గడుస్తున్నా ఇప్పటివరకు బాధ్యులను అరెస్టు చేయకపోవడం దారుణమని, గాయపడ్డ వారిని పరామర్శించేందుకు వెళుతున్న తనను అడ్డగించి పోలీసులు అక్రమంగా అరెస్టు చేయడం అప్రజాస్వామికం అని భాను ప్రకాష్​ అన్నారు. కాగా వీకోటలో ప్రత్యేక సెక్షన్​ అమలులో ఉన్నందున... శాంతిభద్రతల దృష్ట్యా భాజపా నాయకులను ముందస్తు అరెస్ట్​ చేసి సొంత పూచీకత్తుపై విడుదల చేశామని సీఐ రామకృష్ణ వివరించారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details