అధికార పార్టీ ఆగడాలు రోజురోజుకూ మితిమీరుతున్నాయని భాజాపా అధికార ప్రతినిధి భానుప్రకాష్ రెడ్డి విమర్శించారు. తిరుమల లడ్డూ ప్రసాద వితరణ కేంద్రాన్ని ఆయన పరిశీలించారు. చంద్రగిరి నియోజకవర్గం తొండవాడలో ఓటర్లకు లడ్డూలు పంచడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు.
రేషన్ పంపిణీ వాహనంలో వాలంటీర్లే లడ్డూలను పంచిపెట్టడంపై ఎస్‌ఈసీ విచారణ చేయాలని డిమాండ్ చేశారు. ప్రసాదాల కోసం శ్రీవారి భక్తులు ఇబ్బందులు పడుతుంటే... వేలాది లడ్డూలు ఇలా పక్కదారి పడుతున్నాయని మండిపడ్డారు. ఈ విషయంపైపై తితిదే స్పందించాలన్నారు.