రద్దీగా ఉన్న ప్రాంతాల్లో నిలిపి ఉన్న ద్విచక్ర వాహనాలే అతడి లక్ష్యం. ఏదైనా బైక్‌పై తన కన్ను పడిందంటే కొట్టేసే దాకా వదలడు. ఇలా ఒకటి కాదు... రెండు కాదు... ఏకంగా 24 బైక్‌లను చోరీ చేశాడు. దొంగిలించిన బైక్‌పైనే జల్సాగా తిరుగుతూ పోలీసులకు చిక్కాడు.
ఒకే ఒక్కడు... 24 ద్విచక్ర వాహనాలను దొంగిలించాడు - police
భారీగా ద్విచక్ర వాహనాలను దొంగలించిన ఓ వ్యక్తిని తిరుపతి పోలీసులు అరెస్ట్ చేశారు. ఒకటి కాదు.. రెండు కాదు... ఏకంగా 24 బైక్‌లను దొంగిలించాడు ఈ చోరుడు.
తిరుమల బైపాస్ రోడ్లో పోలీసులు వాహన తనిఖీలు నిర్వహిస్తుండగా.. ఆర్టీసీ బస్టాండ్ నుంచి ద్విచక్రవాహనంపై వస్తున్న వ్యక్తిని ఆపారు. వాహనానికి సంబంధించి పత్రాలు లేనందున అతడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వాహనం ఎక్కడి నుంచి వచ్చిందని పోలీసులు తమదైన శైలిలో ప్రశ్నించగా అతడు నిజాలు బయటపెట్టాడు. తిరుపతి ఆర్టీసీ బస్టాండ్ వద్ద బైక్‌ను దొంగలించినట్లు పేర్కొన్నాడు. గతంలో చేసిన దొంగతనాలను కూడా పోలీసులకు వెల్లడించాడు. అతడి చోరీల చిట్టాను వెలికితీసిన పోలీసులు... తిరుపతి ఈస్ట్, రేణిగుంట, పీలేరు పోలీస్ స్టేషన్లలో ఇతడిపై 13 కేసులు నమోదయ్యినట్లు మీడియాకు తెలిపారు. ఇతడి వద్ద నుంచి 11 లక్షల రూపాయల విలువ చేసే 24 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకుని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలిస్తున్నట్లు ఏఎస్పీ వెంకటేశ్వర నాయక్ తెలిపారు..