ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

తంబళ్లపల్లిలో.. చట్టాలపై అవగాహన సదస్సు - చిత్తూరు జిల్లా

గ్రామ ప్రజలకు చట్టాల గురించి తెలిపేందుకు ఇట్నేనివారిపల్లేలో న్యాయవిజ్ఞాన సదస్సు నిర్వహించారు. ఈ సమావేశానికి జూనియర్ సివిల్ కోర్టు జడ్జి హాజరయ్యారు.

చట్టాల అవగాహన సదస్సు

By

Published : Jun 29, 2019, 4:28 PM IST

తంబళ్లపల్లిలో.. చట్టాలపై అవగాహన సదస్సు

చిత్తూరు జిల్లా తంబళ్లపల్లి గ్రామ పరిధిలోని ఇట్నేనివారిపల్లెలో చట్టాల అవగాహన కార్యక్రమం జరిగింది. మండల న్యాయసేవా సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన సదస్సుకు తంబళ్లపల్లి జూనియర్ సివిల్ కోర్టు జడ్జి అంజయ్య, ఎస్ఐ శివకుమార్ పాల్గొన్నారు. ఇందులో భాగంగా గిరిజనుల చట్టాలు, హక్కులు, భూ తగాదాలు, భార్యాభర్తల వివాదాలు, తల్లిదండ్రుల పోషణ, భరణం కేసులు, మహిళ చట్టాల గురించి అవగాహన కల్పించారు. పల్లెలోని యానాదుల సమస్యలను కూడా అధికారుల దృష్టికి తీసుకెళ్లి, పరిష్కారానికి చర్యలు తీసుకుంటామన్నారు. అనంతరం గ్రామ ప్రజలకు ఎస్​ఐ ఈ అంశం పట్ల పలు సలహాలు ఇచ్చారు. భూమి పట్టా పాసు పుస్తకాలు, తాగునీటి సమస్య పరిష్కరించాలని ఇట్నేనివారి పల్లె ప్రజలు కోరారు.

ABOUT THE AUTHOR

...view details