ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

మోడల్​ పాఠశాలలో న్యాయ విజ్ఞాన సదస్సు - chittoor

చిత్తూరు జిల్లా తంబళ్లపల్లి మోడల్​ పాఠశాలను న్యాయమూర్తి అంజయ్య సందర్శించారు. న్యాయ విజ్ఞాన సదస్సులో పాల్గొన్నారు. విద్యార్థులకు పలు అంశాలపై పలు సూచనలు ఇచ్చారు.

మోడల్​ పాఠశాలలో న్యాయ విజ్ఞాన సదస్సు

By

Published : Jul 27, 2019, 11:31 PM IST

మోడల్​ పాఠశాలలో న్యాయ విజ్ఞాన సదస్సు

చిత్తూరు జిల్లా తంబళ్లపల్లి జూనియర్ సివిల్ జడ్జి కోర్టు న్యాయమూర్తి అంజయ్య తంబళ్లపల్లి మోడల్ పాఠశాలను సందర్శించారు. శనివారం మండల న్యాయ సేవా సంఘం ఆధ్వర్యంలో న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. సదస్సులో బాలల చట్టాలు, నేరాలు, బాలలను ఇతర విద్రోహ శక్తులు ఎలా వినియోగించుకునేది, మైనర్లు చేయకూడని పనులు, విద్యార్థుల క్రమశిక్షణ, విద్యాభివృద్ధి పై పట్టుదల, నాణ్యమైన విద్యాబోధన, సంస్కారవంతమైన చదువు, బాలల హక్కులు, సత్ప్రవర్తన, న్యాయ సంబంధమైన అంశాలపై న్యాయమూర్తి అవగాహన కల్పించారు. న్యాయవాది గఫార్, తంబళ్లపల్లె ఎస్ఐ శివకుమార్, మోడల్ పాఠశాల ఇన్​ఛార్జి ప్రిన్సిపల్ హేమావతి, ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఆంజనేయులు చట్టాలు, క్రమశిక్షణ, విద్యాభివృద్ధి, హక్కులు, బాధ్యతలపై పిల్లలను చైతన్య పరిచారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details