చిత్తూరు జిల్లా రామచంద్రపురం మండలం ఎన్.ఆర్.కండ్రిగలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఓటమి భయంతోనే చెవిరెడ్డి రీపోలింగ్ పెట్టించారని గ్రామస్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు. చెవిరెడ్డి కుమారుడు మోహిత్‌రెడ్డిని గ్రామంలోకి రాకుండా గ్రామస్థులు అడ్డుకున్నారు. చెవిరెడ్డి కుమారుడిపై మహిళలు దాడికి యత్నించారు. వైకాపా నాయకులతో కలిసి మోహిత్‌రెడ్డి గ్రామంలో బైఠాయించారు. ఇంతలో తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి పులివర్తి నాని ఆ గ్రామానికి చేరుకున్నారు. రాత్రి 10 గంటలు దాటటం వల్ల ప్రచారం చేసేందుకు వీల్లేదని... వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆ గ్రామంలో పోలీస్ పికెట్ కొనసాగుతోంది.
చంద్రగిరిలో చెవిరెడ్డి కుమారుడిని అడ్డుకున్న గ్రామస్థులు
చిత్తూరు జిల్లా ఎన్.ఆర్.కండ్రిగలో టెన్షన్ వాతావరణం నెలకొంది. చెవిరెడ్డి కావాలనే రీపోలింగ్ పెట్టించారని ఆరోపణలతో ఆయన కుమారుడిని గ్రామస్థులు అడ్డుకున్నారు. దాడికి యత్నించారు.
చెవిరెడ్డి కుమారుడిపై దాడికి యత్నం
Last Updated : May 16, 2019, 11:46 PM IST