చిత్తూరు జిల్లా తంబళ్లపల్లె నియోజకవర్గం బి.కొత్తకోట మండలంలోని బండారువారిపల్లె బాలిక కిడ్నాప్, అత్యాచారయత్నం కేసుకు సంబంధించి ముగ్గురు వ్యక్తులను అరెస్టు చేసినట్లు మదనపల్లి సర్కిల్ ఇన్స్పెక్టర్ అశోక్ కుమార్ తెలిపారు.
బాలిక పై అత్యాచారయత్నం.. నిందితుల అరెస్ట్ - చిత్తూరు జిల్లా, తంబళ్లపల్లె
బాలిక కిడ్నాప్, అత్యాచారయత్నం కేసుకు సంబంధించి ముగ్గురు నిందితులను మదనపల్లి పోలీసులు అరెస్టు చేశారు.
ఎనిమిదవ తరగతి చదువుతున్న బాలికను ఈనెల 1న కిడ్నాప్ చేసి తీసుకెళ్లి శీలంవారి పల్లి పంచాయతీ పరిధిలోని క్వారీ సమీపంలో బంధించి అత్యాచారానికి యత్నించినట్లు పోలీసులు పేర్కొన్నారు. బాలిక అరుపులు విన్న సమీప పొలాల రైతులు కొందరు సమాచారాన్ని బాలిక కుటుంబ సభ్యులకు అందించారని, వారు రాత్రి 10 గంటల సమయంలో క్వారీ వద్దకు చేరుకోగా దుండగులు పారిపోగా బాలికను తీసుకెళ్లారని పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై జూన్ రెండో తేదీ కేసు నమోదు చేసి గాలించగా ఇవాళ ముగ్గురు నిందితులు దొరికినట్లు పోలీసులు పేర్కొన్నారు.
ఇది చదవండిమైనర్పై 60ఏళ్ల వ్యక్తి అత్యాచారం