ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

భూఆక్రమణపై జవాన్​ వీడియో... పరుగులు పెట్టిన అధికారులు

తమ భూమి ఆక్రమణకు గురైందన్న ఓ జవాన్‌ ఆవేదనకు న్యాయం జరిగింది. సామాజిక మాధ్యాల్లో పెట్టిన సెల్ఫీ వీడియోపై అధికారులు స్పందించారు. బాధితులకు న్యాయం చేశారు.

By

Published : Aug 21, 2019, 9:15 AM IST

జవాన్​ వీడియోకు స్పందన... సమస్య పరిష్కారించిన అధికారులు

చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు మండలం పరిధిలోని ఎల్లాపల్లి వాసులు దేవేంద్ర, చంద్రబాబు ఆర్మీలో పని చేస్తున్నారు. తమకు ఉన్న ఇంటి స్థలాన్ని సాంబశివనాయుడు, శోభన్ బాబు ఆక్రమించుకున్నారని... అడిగితే బెదిరిస్తున్నారని కుమారులకు తల్లి సమాచారం ఇచ్చింది. తల్లికి తోడుగా ఎవరూ లేరని కంగారు పడ్డ చిన్న కుమారుడు చంద్రబాబు... జరిగిన అన్యాయం వివరిస్తూ ఓ సెల్ఫీ సమాజిక మాధ్యమాల్లో పెట్టాడు. న్యాయం చేయాలని అభ్యర్థించాడు. దీనిపై స్పందించిన ప్రభుత్వ అధికారులు... హుటాహుటిన ఆ గ్రామానికి చేరుకున్నారు. క్షేత్రస్థాయిలో పరిశీలించి గ్రామంలో సర్వే నెంబర్ 30లో 6.41 ఎకరాల భూమి ఉందని, అందులో గ్రామస్థులు స్థిరనివాసం ఏర్పాటు చేసుకున్నారని నిర్ధారించారు. చంద్రబాబు, మహేంద్ర కుటుంబానికీ ఇంటి స్థలానికి పట్టాలు గతంలో మంజూరయ్యాయని తెలిపారు. దీనికి సంబంధించి రోడ్డు సమస్య ఉన్నట్టు తేలినందున ఆ స్థలాన్ని సర్వే చేసి రోడ్డు సౌకర్యాన్ని అధికారులు కల్పించారు. సమస్యను పరిష్కరించి బాధితులకు ఊరట కలిగించారు.

జవాన్​ వీడియోకు స్పందన... సమస్య పరిష్కారించిన అధికారులు

ABOUT THE AUTHOR

...view details