చిత్తూరు జిల్లా తిరుపతి గ్రామీణ మండలం చిగురువాడ గ్రామానికి చెందిన రిటైర్డ్ టీచర్ ఏ. గెరటా రెడ్డి, సులోచన దంపతులకు కరోనా పాజిటివ్ నిర్థారణ కావడంతో హోం ఐసోలేషన్లో ఉన్నారు. శ్వాస తీసుకోవడం ఇబ్బందిగా మారడంతో రుయా ఆసుపత్రికి చికిత్సకు వెళ్లారు. పరిస్థితి విషమించడంతో భర్త గెరటారెడ్డి గురువారం చనిపోయారు. ఆయనకు అంత్యక్రియలు నిర్వహించి ఇంటికి రాగానే ఆయన భార్య సులోచన మృతిచెందింది. వీరికి కుమారుడు, కుమార్తె ఉన్నారు. కుమారుడు (28) పాజిటివ్ తో చికిత్స పొందుతూ తిరుపతిలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో ఆదివారం ఉదయం తుదిశ్వాస విడిచారు. ఒకే కుటుంబంలో నాలుగు రోజుల వ్యవధిలో ముగ్గురు మరణించడంతో మిగిలిన ఆ ఒక్కగానొక్క కుమార్తెను ఓదార్చడం ఎవరి వల్ల కావడం లేదు.
కనికరం చూపని కరోనా.. ఒకే కుటుంబంలో ముగ్గురు మృతి - corona case in Chittoor district
చిన్నకుటుంబం.. చింతలేకుండా ప్రశాంతంగా గడుస్తున్న సమయంలో కరోనా మహమ్మారి ఆ కుటుంబంలో అంతులేని విషాదాన్ని నింపింది. నాలుగు రోజుల వ్యవధిలో దంపతులు, వారి కుమారుడు మృతిచెందారు. ఈ హృదయ విదారక ఘటన తిరుపతి రూరల్ మండలంలో జరిగింది. కుటుంబంలో మిగిలిన ఒక్కగానొక్క ఆ ఆడబిడ్డను ఓదార్చడం ఎవరితరం కాలేదు.
corona deaths