పిల్లలకు అందించాల్సిన మధ్యాహ్న భోజనంలో అవకతవకలు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ సిీ.ఐ అబ్బన తెలిపారు. చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిలోని జడ్పీ బాలుర ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజనాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. సుమారు 700 మంది విద్యార్థులు పాఠశాలలో చదువుతున్నప్పటికీ కేవలం వంద మంది విద్యార్థులకు మాత్రమే నామమాత్రంగా మధ్యాహ్నం భోజనం తయారు చేసి పూర్తి స్థాయిలో విద్యార్థులకు మధ్యాహ్నం భోజనం వడ్డించి నట్లుగా రికార్డు నమోదు చేస్తున్నట్లు గుర్తించారు. భోజనం నాణ్యత సక్రమంగా లేకపోవడంతో పాటు జాబితా ప్రకారం పిల్లలకు పంపిణీ చేయకపోవడం వంటి అంశాలను గుర్తించారు. తనిఖీల అంశం ఉన్నతాధికారులకు తెలియజేయనున్నట్లు సీఐ వివరించారు.
మధ్యాహ్న భోజనంలో అవకతవకలు చేస్తే చర్యలు తప్పవు
చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిలోని జడ్పీ బాలుర హై స్కూల్లో విజిలెన్స్ అధికారులు తనిఖీలు చేశారు.మధ్యాహ్న భోజనాన్నిపరిశీలించారు. అవతవకలకు పాల్పడితే చర్యలు తప్పవని సిబ్బందిని హెచ్చరించారు.
మధ్యాహ్న భోజనాన్ని తనిఖీ చేస్తున్న విజిలెన్స్ అధికారులు
ఇవీ చదవండి