ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థుల కోసం శ్రీకాళహస్తిలో సైకిళ్లు సిద్ధం చేశారు. ఇంతలో ఎన్నికల కోడ్ వచ్చింది. ఇది సైకిళ్ల పంపిణీకి అడ్డంకిగా మారింది.
విద్యార్థులకు పంపిణీ చేయాల్సిన సైకిళ్ల విడిభాగాలు శ్రీకాళహస్తి విద్యావనరుల కేంద్రానికి ఎప్పుడో చేరుకున్నాయి. విడి భాగాలను సైకిల్‌గా సిద్ధం చేయించారు. మండల వ్యాప్తంగా 8 , 9 తరగతులు చదువుతున్న 1352 మంది విద్యార్థులకు వీటిని పంపిణీ చేయాల్సిఉంది. ఎన్నికలు ఉండడంతో పంపిణీకి సిద్ధమైన సైకిళ్లను కార్యాలయ ఆవరణంలో నిల్వ ఉంచారు. కోడ్ ముగిసిన వెంటనే పంపిణీ చేసేందుకు సిద్ధం చేస్తున్నారు.