రాజకీయ పార్టీలకు చెందిన ఎమ్మెల్యే అభ్యర్థులు ఎవరూ తమను ఓటు అడగలేదని ఓటర్లు పోలింగ్ బహిష్కరించారు. చిత్తూరు జిల్లా మదనపల్లిలోని రోడ్డుపై ప్రజలు నిరసన తెలిపారు. గత 15 రోజులుగా మదనపల్లికి చెందిన అభ్యర్థులు ఎవరూ తమ ప్రాంతానికి రాలేదన్నారు. తమ ప్రాంత సమస్యల గురించి ఎవరూ పట్టించుకోలేదని ఆగ్రహించారు. నిన్నటి వరకు తాము నాయకుల కోసం ఎదురు చూశామని.. అయినా ఎవరూ రాకుండా తమపై నిర్లక్ష్యం చేశారని మండిపడ్డారు. స్థానిక సమస్యల గురించి చెప్పుకోవడానికి అవకాశం ఇవ్వలేదన్నారు. అందుకే ఈ ఎన్నికలను తాము బహిష్కరిస్తున్నట్లు స్పష్టం చేశారు.
ప్రచారానికి ఎవరూ రాలేదని.. పోలింగ్ బహిష్కరణ
చిత్తూరు జిల్లా మదనపల్లిలో రాజకీయపార్టీల అభ్యర్థులు ఓట్లు అడగలేదని ఓటర్లు పోలింగ్ బహిష్కరించారు.
ఓట్లును బహిష్కరించిన గ్రామస్తులు