- రుషికొండ తవ్వకాలపై కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులతో కమిటీ వేయాలి:హైకోర్టు
రుషికొండ తవ్వకాలపై ఏర్పాటు చేసిన కమిటీలో రాష్ట్ర ప్రభుత్వ శాఖలకు చెందిన ముగ్గురు అధికారులు ఉండటంపై హైకోర్టు అభ్యంతరం వ్యక్తం చేసింది. రాష్ట్ర ప్రభుత్వమే ఆరోపణలు ఎదుర్కొంటున్న ఈ అంశంపై రాష్ట్ర ప్రభుత్వ అధికారులు ఉండటం సరికాదని వ్యాఖ్యానించింది. కమిటీపై పునఃపరిశీలించాలని.. కేంద్ర పర్యావరణ, అటవీశాఖకు సూచించింది.
- ఉమ్మడి ఆస్తుల విభజనపై సుప్రీంకోర్టులో ఏపీ పిటిషన్
ఉమ్మడి ఆస్తుల విభజనపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. విభజన జరిగి ఎనిమిదేళ్లయినా..షెడ్యూల్ 9,10లో పేర్కొన్న ఆస్తుల్ని విభజించకపోవడం వల్ల ఆంధ్రప్రదేశ్ ప్రాథమిక, రాజ్యాంగ హక్కులకు భంగం కలుగుతోందని కోర్టుకు విన్నవించింది. లక్షా 42వేల 601 కోట్ల రూపాయల మేర విలువైన ఆస్తులను పంచకపోవడం వల్ల ప్రభుత్వంతో పాటు ప్రజలపై ప్రభావం చూపుతోందని వీలైనంత త్వరగా పరిష్కారం చూపాలని ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టును కోరింది.
- ఈ నెల 22న హైకోర్టుకు సీఎస్ జవహర్‌రెడ్డి హాజరు కావాలని ఆదేశం
ప్రభుత్వ పాఠశాలల ప్రాంగణాల్లో గ్రామ సచివాలాయాలు, ఆర్బీకేల నిర్మాణాల విషయంలో.. ప్రభుత్వ తీరును హైకోర్టు తీవ్రంగా తప్పుపట్టింది. పాఠశాలల ప్రాంగణాల్లో సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాల నిర్మాణం అక్రమేనని తేల్చిచెప్పింది. నిర్మాణాల తొలగింపులో జాప్యంపై స్వయంగా కోర్టుకు హాజరై వివరణ ఇవ్వాలని.. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ఆదేశించింది. గుత్తేదారులకు ప్రభుత్వం సొమ్ములు చెల్లించడం అక్రమమేనన్న ధర్మాసనం.. అధికారుల నుంచి ఆ డబ్బును రాబడతామని స్పష్టం చేసింది.
- శుభవార్త.. సంక్రాంతి పండుగకు ఆర్టీసీ ప్రత్యేక బస్సులు
సంక్రాంతి పండుగకు సొంతూళ్లకు వెళ్లే వారికోసం ఆర్టీసీ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. జనవరి 6 నుంచి 18వ తేదీ వరకు పలు ప్రాంతాలకు ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసింది. ప్రత్యేక బస్సుల్లో 50 శాతం అదనపు చార్జీ వసూలు చేయకూడదని ఆర్టీసీ నిర్ణయించింది. ప్రత్యేక బస్సుల్లోనూ సాధారణ బస్సుల్లో వసూలు చేసే చార్జీలే తీసుకోవాలని ఆర్టీసీ ఆదేశాలిచ్చింది.
- రూ.4 కోట్ల బీమా కోసం ఫ్రెండ్ మర్డర్.. యాక్సిడెంట్‌గా చిత్రీకరించి..
స్నేహితుడి పేరుపై ఉన్న రూ.4 కోట్ల బీమాను కాజేయడానికి అతన్ని హత్య చేశారు. అనంతరం దాన్ని యాక్సిడెంట్‌గా చిత్రీకరించారు. మృతుడి సోదరుడి ఫిర్యాదుతో అసలు విషయం బయటపడింది. ఈ దారుణం మహారాష్ట్రలో వెలుగుచూసింది. మరో ఘటనలో ఓ వ్యక్తి రూ. 60 లక్షల అప్పుగా తీసుకున్నాడు. ఆ డబ్బులు తిరిగి ఇవ్వాల్సి వస్తుందని యువకుడిని హతమార్చాడు. ఈ దారుణం ఉత్తర్‌ప్రదేశ్‌లో జరిగింది.
- 'అప్పట్లో నెహ్రూ 100 మంది ప్రసంగం విన్నారు.. అలాంటి చర్చ అవసరం'
కేంద్ర ప్రభుత్వంపై కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ మండిపడ్డారు. అరుణాచల్‌ప్రదేశ్‌లోని తవాంగ్ సెక్టార్లో జరిగిన భారత్-చైనా సరిహద్దు ఉద్రిక్తతలపై కేంద్రం వివరణ ఇవ్వకపోవడం ప్రజాస్వామ్యం అనిపించుకోదని ఆయన పేర్కొన్నారు. 1962 భారత్- చైనా యుద్ధం సమయంలో అప్పటి ప్రధాని నెహ్రూ పార్లమెంట్లో సుదీర్ఘ చర్చ జరిపిన విషయాన్ని శశిథరూర్ గుర్తుచేశారు.
- 'ఉగ్రదాడులు చేస్తూ.. సంబరాలా?'.. ఐరాస వేదికగా పాక్, చైనాలకు జైశంకర్ చురకలు
ఐరాస భద్రతా మండలి వేదికగా పాకిస్థాన్, చైనాలకు పరోక్షంగా చురకలు అంటించారు భారత విదేశాంగ మంత్రి జైశంకర్. పాకిస్థాన్ ప్రోత్సహిస్తున్న జైషే మహమ్మద్ చీఫ్ మసూద్ అజార్ వంటి తీవ్రవాదులను బ్లాక్‌లిస్ట్‌లో చేర్చాలనే ప్రతిపాదనలకు వీటో అధికారంతో చైనా పదేపదే అడ్డుపడడంపై అభ్యంతరం తెలిపారు.
- మస్క్ సంపద డౌన్.. ప్రపంచ కుబేరుడిగా బెర్నార్డ్ ఆర్నాల్ట్.. అసలు ఎవరీయన?
Bernard Arnault World Richest Man : ప్రపంచ కుబేరుల జాబితాలో ఎలాన్ మస్క్ రెండో స్థానానికి పడిపోయారు. ఫ్రెంచ్ వ్యాపారవేత్త బెర్నార్డ్ ఆర్నాల్ట్ మొదటి స్థానంలో నిలిచారు.
- సెమీస్‌లో మొరాకో చిత్తు.. ఫైనల్‌కు చేరిన డిఫెండింగ్ ఛాంపియన్
FIFA World Cup 2022 :సంచలన ప్రదర్శనతో సెమీస్ చేరిన ఆఫ్రికా జట్టు మొరాకోను.. డిఫెండింగ్ ఛాంపియన్ ఫ్రాన్స్ చిత్తు చేసింది. హోరాహోరీగా సాగిన సెమీస్ పోరులో ఫ్రాన్స్ 2-0 తేడాతో గెలిచి ఫైనల్లో అడుగుపెట్టింది. ఇక ఆదివారం జరిగే ఫైనల్లో.. ఈ మాజీ ఛాంపియన్ అర్జెంటీనాతో తలపడనుంది.
- టాప్-50 ఏషియన్ సెలబ్రిటీల జాబితాలో.. తారక్, చరణ్ ఫస్ట్ ప్లేస్..
యూకేలో ప్రతి సంవత్సరం విడుదల చేసే టాప్-50 ఆసియన్ సెలబ్రిటీల జాబితాలో టాలీవుడ్ స్టార్స్ ఎన్టీఆర్, రామ్‌చరణ్ అగ్ర స్థానంలో నిలిచి చరిత్ర సృష్టించారు. ఇంకా ఈ జాబితాలో ఎవరెవరు నిలిచారంటే..?