తిరుమల శ్రీవారిని ఉపముఖ్యమంత్రి నారాయణస్వామి దర్శించుకున్నారు. వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో స్వామివారి సేవలో పాల్గొన్నారు. వైకాపా ప్రభుత్వం మహిళలకు అధిక ప్రాధాన్యత ఇస్తోందని ఆయన తెలిపారు. తన నియోజకవర్గంలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో వంద శాతం సీట్లు మహిళలకే కేటాయించినట్లు వివరించారు. నియోజకవర్గ అభివృద్ధికి ప్రణాళికలు రూపొందించామన్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌పై ధ్వజమెత్తారు. మహిళలంటే పవన్ కల్యాణ్‌కు గౌరవం లేదని వెల్లడించారు. పవన్ ఎప్పుడు ఏ పార్టీలో ఉంటారో తెలియని పరిస్థితి ఉందని ఉపముఖ్యమంత్రి నారాయణస్వామి విమర్శించారు.
DEPUTY CM NARAYANA SWAMY: 'మహిళలు అంటే పవన్‌కల్యాణ్‌కు గౌరవం లేదు' - ap 2021 news
జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు మహిళలంటే గౌరవం లేదని ఉపముఖ్యమంత్రి నారాయణస్వామి అన్నారు. ఆయన ఎప్పుడు ఏ పార్టీలో ఉంటారో కూడా తెలియదని విమర్శించారు.
మహిళలు అంటే పవన్‌కల్యాణ్‌కు గౌరవం లేదు