ETV Bharat Andhra Pradesh

ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ముందే వచ్చిన సంక్రాంతి.. వెనుకే వచ్చిన పోలీసులు..! - బొప్పరాజుపల్లిలో పశువుల పండుగను మధ్యలో అడ్డుకున్న పోలీసులు

సంక్రాంతికి ముందే కోడె గిత్తలు రంకెలేశాయి. గుంపులుగా వస్తున్న పశువులను నిలువరించేందుకు యువకులు పోటీపడ్డారు. పోలీసుల రంగప్రవేశంతో పండుగ మధ్యలో నిలిచిపోయింది. చిత్తూరు జిల్లా రామచంద్రాపురం మండలంలోని బొప్పరాజుపల్లెలో జరిగిందీ ఘటన.

animal festival
పశువుల పండుగ
author img

By

Published : Nov 22, 2020, 5:37 PM IST

చిత్తూరు జిల్లా రామచంద్రాపురం మండలం బొప్పరాజుపల్లెలో.. పశువుల పండుగను గ్రామస్థులు ఘనంగా నిర్వహించారు. పరిసర ప్రాంతాల నుంచి వచ్చిన వందల మంది.. ఈ పండుగలో పాల్గొన్నారు. ఎద్దుల కొమ్ములకు పలకలు కట్టి రంగంలోకి దించారు. రంకెలేస్తూ పరుగులు పెట్టిన పశువులను నిలువరించేందుకు యువకులు పోటీపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు.. గుంపులుగా ఉన్న గ్రామస్థులను, యువకులను చెదరగొట్టారు. పశువుల పండుగ మధ్యలో నిలిచిపోయింది.

కరోనా వ్యాపిస్తున్న నేపథ్యంలో.. పశువుల పండుగకు పోలీసులు అనుమతి ఇవ్వడం లేదు. గత ఆరు నెలలుగా ఎలాంటి పండుగలు జరుపుకోవడం లేదని.. సాంప్రదాయంగా ఇప్పుడీ వేడుకలు నిర్వహించుకుంటున్నట్లు స్థానికులు తెలిపారు. కొవిడ్ నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తిస్తే.. కేసులు నమోదు చేస్తామని పోలీసులు హెచ్చరించారు.

పశువుల పండుగ

ఇదీ చదవండి:కాళహస్తీశ్వరాలయంలో లీకేజీ నియంత్రణ చర్యలకు ఆమోదం

ABOUT THE AUTHOR

...view details