ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'ఆంగ్లమాధ్యమంలో ఇబ్బందులున్నాయ్.. తొలగించుకోవాలి'

అమ్మఒడి పథకాన్ని చిత్తూరులో ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌రెడ్డి ప్రారంభించారు. వచ్చే విద్యాసంవత్సరం 1 నుంచి ఆరో తరగతి వరకు ఆంగ్ల మాధ్యమం ప్రవేశపెడతామని ప్రకటించారు. ఆ తరువాత ఒక్కో ఏడాది ఒక్కో తరగతి పెంచుకుంటూ వెళ్తామన్నారు. ‘పిల్లల చదువు తల్లికి భారం కాకూడదన్న సీఎం.. పిల్లలకు మనమిచ్చే ఆస్తి చదువని పేర్కొన్నారు. 43 లక్షల మంది తల్లులకు వారి బ్యాంకు ఖాతాల్లో రూ.15వేలు జమచేస్తామని తెలిపారు.

amma-vadi-scheme-cm-jagan-launch-in-chittoor
amma-vadi-scheme-cm-jagan-launch-in-chittoor

By

Published : Jan 9, 2020, 2:23 PM IST

Updated : Jan 9, 2020, 2:33 PM IST

'అమ్మ ఒడి' పథకాన్ని ముఖ్యమంత్రి జగన్... చిత్తూరులో లాంఛనంగా ప్రారంభించారు. పిల్లల చదువు తల్లికి భారం కాకూడదనే ఈ పథకాన్ని ప్రవేశపెట్టామని జగన్ అన్నారు. అమ్మ ఒడి జాబితాలో పేరు నమోదుకు గడువు తేదీ పొడిగిస్తున్నట్లు ప్రకటించిన సీఎం...... ఫిబ్రవరి 9లోపు అర్హులైన తల్లులు నమోదు చేయించుకోవాలని చెప్పారు. పాఠశాలల్లో మౌలిక సౌకర్యాల కోసం ప్రతి తల్లి వెయ్యి రూపాయలు ఇస్తే బాగుంటుందన్న సీఎం జగన్.....ప్రభుత్వం ఇచ్చే 15 వేలలో వెయ్యి రూపాయలు పాఠశాలకు ఇవ్వాలని కోరారు.

అమ్మఒడి పథకాన్ని ప్రారంభించిన సీఎం

చిత్తూరులో అమ్మఒడి పథకానికి ముఖ్యమంత్రి జగన్ శ్రీకారం చుట్టారు. వచ్చే విద్యాసంవత్సరం 1 నుంచి ఆరో తరగతి వరకు ఆంగ్ల మాధ్యమం ప్రవేశపెడతామని ప్రకటించారు. ఆ తరువాత ఒక్కో ఏడాది ఒక్కో తరగతి పెంచుకుంటూ వెళ్తామన్నారు. ‘పిల్లల చదువు తల్లికి భారం కాకూడదన్న సీఎం.. పిల్లలకు మనమిచ్చే ఆస్తి చదువని పేర్కొన్నారు. 43 లక్షల మంది తల్లులకు వారి బ్యాంకు ఖాతాల్లో రూ.15వేలు జమ చేస్తామని తెలిపారు. దాదాపు 81 లక్షల మంది పిల్లలకు అమ్మ ఒడి పథకం ద్వారా ప్రయోజనం కలుగుతుందని స్పష్టం చేశారు. వచ్చే ఏడాది నుంచి 75శాతం విద్యార్థుల హాజరు తప్పని సరి చేస్తామని హామీ ఇచ్చారు. మేనిఫెస్టోలో ఒకటి నుంచి పదోతరగతి వరకు అని చెప్పినా... ఇంటర్‌ వరకు ఈ పథకాన్ని పొడిగించాం’’అని ముఖ్యమంత్రి జగన్ తెలిపారు. ఆంగ్ల మాధ్యమం వల్ల కొన్ని ఇబ్బందులు వస్తాయ్న సీఎం.. వాటిని అధిగమించాలని అన్నారు.

'ఆంగ్లమాధ్యమంలో ఇబ్బందులున్నాయ్.. తొలగించుకోవాలి'

తిరిగి వెయ్యి రూపాయలు ఇవ్వండి...

అమ్మఒడికి ఇచ్చే సొమ్ముల్లో బడి కోసం వెయ్యి రూపాయలు తిరిగి ఇవ్వాలని జగన్ తల్లిదండ్రులకు సూచించారు. ఇవాళ విమర్శించే వాళ్లంతా వాళ్ల పిల్లలను ఆంగ్ల మాధ్యమంలో చదివిస్తున్నారని సీఎం జగన్ అన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో సిలబస్‌ మార్చే కార్యక్రమం చేస్తున్నామని తెలిపారు. మధ్యాహ్న భోజనం పథకంలో మెనూ కూడా మార్చామని అన్నారు. రూ.200 కోట్లు ఖర్చయినా సంతోషంగా భారాన్ని భరిస్తున్నామని సీఎం స్పష్టం చేశారు.

ఇదే బడిలో ఆహారం:

రోజుకో వెరైటీ ఫుడ్‌... వారంలో మూడు రోజులు మిఠాయి..

  • సోమవారం - అన్నం ,పప్పు చారు, ఎగ్‌ కర్రీ, స్వీట్‌, చిక్కీ
  • మంగళవారం - పులిహోరా, టమాటా పప్పు, ఉడికించిన గుడ్డు
  • బుధవారం - వెజిటేబుల్‌ రైస్‌, ఆలుకుర్మా, ఉడికించిన గుడ్డు, స్వీట్‌, చిక్కీ
  • గురువారం - కిచిడీ, టమాటా చట్నీ, ఉడికించిన గుడ్డు
  • శుక్రవారం - అన్నం, ఆక్కూర పప్పు, ఉడికించిన గుడ్డు, స్వీట్‌, చిక్కీ
  • శనివారం - అన్నం సాంబార్‌, స్వీట్‌ పొంగల్‌
Last Updated : Jan 9, 2020, 2:33 PM IST

ABOUT THE AUTHOR

...view details