ఈనెల 17న అమరావతి రైతులు తిరుపతిలో నిర్వహించబోయే సభకు అనుమతిపై పోలీసులు ఇంకా స్పందించలేదని ఐకాస నేతలు తెలిపారు. పోలీసులు అడిగిన ప్రశ్నలకు తాము సమాధానాలు పంపినట్లు వివరించారు. సభకు అనుమతిపై త్వరితగతిన నిర్ణయం తీసుకోవాలన్న వారు.. అనుమతి త్వరగా ప్రకటిస్తే ఏర్పాట్లు చేసుకుంటామని వెల్లడించారు. తిరస్కరిస్తే.. తదుపరి కార్యాచరణ ప్రకటిస్తామని స్పష్టం చేశారు.
శ్రీవారి దర్శన భాగ్యం కల్పించాలి..!
పాదయాత్రగా వస్తున్న రైతులందరికీ తిరుమల శ్రీవారి దర్శన భాగ్యం కల్పించాలని.. అమరావతి పరిరక్షణ సమితి నేతలు తితిదేను కోరారు. ఈనెల 15, 16వ తేదీల్లో స్వామివారిని దర్శించుకోవాలనుకుంటున్నట్లు పేర్కొన్నారు. దాదాపు 500 మందికి శ్రీవారి దర్శనం కల్పించాలని అభ్యర్థించారు. అలాగే ఈ విషయానికి రాజకీయాలు ముడిపెట్టొద్దని విజ్ఞప్తి చేశారు. పాదయాత్రలో మొత్తం 200 కుటుంబాలు పాల్గొంటున్నాయని తెలిపిన నేతలు.. ఒక్కసారి కాకపోయినా విడతల వారీగా అయినా మొక్కు చెల్లించుకునే భాగ్యం కల్పించాలని కోరారు.
సభకు అనుమతిపై వెంటనే స్పందించండి ఇదీ చూడండి:
AMARAVATI FARMERS: అమరావతి రైతులకు నెల్లూరు వాసుల వీడ్కోలు