తిరుపతిలోని తుడా కార్యాలయంలో అఖిలపక్షం నేతలతో చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి సమావేశం నిర్వహించారు. తుడా అభివృద్ధికి సలహాలు, సూచనలు ఇవ్వాలని కోరారు. తిరుపతి నగర అభివృద్ధి కోసం పార్టీలకతీతంగా కృషి చేద్దామన్న భాస్కర్‌రెడ్డి... మూడు నెలలకోసారి అఖిలపక్షం సమావేశం నిర్వహిస్తామన్నారు. నగర సుందరీకరణలో భాగంగా ఉద్యానవనాలు అభివృద్ధి చేస్తామన్నారు. నర్సరీలను పెంచటం ద్వారా ఉచితంగా మొక్కల పంపిణీ చేస్తామన్న ఆయన... రెవెన్యూ, పోలీసు కార్యాలయాలు, ఆసుపత్రుల్లో రిసెస్షన్ సెంటర్లను నిర్మిస్తామని చెప్పారు. శెట్టిపల్లి భూ సమస్య పరిష్కరించేందుకు కృషి చేస్తానని తెలిపారు.
'పార్టీలకతీతంగా తిరుపతి అభివృద్ధికి కృషి చేద్దాం'
తుడా పరిధిలోని సామాన్య ప్రజలకు తక్కువ ధరకు ప్లాట్లను అందుబాటులోకి తీసుకొస్తామని తిరుపతి పట్టణాభివృద్ధి సంస్థ ఛైర్మన్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అన్నారు.
చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి